కస్తూర్బా గాంధీ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన మున్సిపల్ చైర్ పర్సన్

తిరుమలగిరి 19 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మున్సిపల్ చైర్ పర్సన్ చాగంటి అనసూయ రాములు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకొని టీచర్లను మంచి చదువు చెప్పాలని కోరారు నూతన మెస్ చార్జీల పెంపు అనేది ఎప్పటినుండో ఉన్న డిమాండ్, దానిని మన కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చింది అని తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు