కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన

Dec 24, 2025 - 19:31
 0  10

 ఆలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ విజయుడు. 

జోగులాంబ గద్వాల 24 డిసెంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి :  అలంపూర్ నియోజకవర్గంలో ఆలంపూర్ చౌరస్తా - ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు అయిజ, మానవపాడు, ఇటిక్యాల, ఆలంపూర్ మండలాల చెందిన  376 మంది లబ్ధిదారులకు (మొత్తం ₹3.76 కోట్ల రూపాయలు)  కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఆలంపూర్ శాసనసభ్యులు శ్రీ విజయుడు ఈ కార్యక్రమం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ పథకం ద్వారా పేదవారి కుమార్తెల వివాహాలకు గొప్ప ఆర్థిక భరోసా కల్పిస్తుందని. ప్రతి చెక్కు ₹1,00,116 విలువ కలిగి, మొత్తం ₹3.76 కోట్ల రూపాయల 376 మంది లబ్ధిదారులకు  సహాయం అందించడం నాకు సంతోషకరమని, అల్లంపూర్ నియోజకవర్గం అభివృద్ధి కొరకై నిరంతరం కృషి చేస్తానని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఆలంపూర్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని ప్రశంసించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333