కమ్యూనిస్టులు ఐక్యం కావాలి

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ కమ్యూనిస్టులు ఐక్యం కావాలి. అమరవీరుల ఆశయ సాధన కోసం ప్రజా పోరాటాల నిర్మాణమే ఏకైక మార్గం* ..... *ఎం సి పి ఐ (యు) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్ది కాయల అశోక్ ఓంకార్* *ఏపూరు లో ఘనంగా ప్రారంభమైన అమరజీవి కామ్రేడ్ ఓంకార్ గారి శతజయంతి వార్షికోత్సవ స్మారక జ్యోతి ప్రారంభ సభ - ప్రదర్శన* *అమరవీరుల - అమరజీవుల ఆశయ సాధన కోసం ప్రజా పోరాటాల నిర్మాణమే ఏకైక మార్గం* ఆత్మకూర్ ఎస్ : కమ్యూనిస్టులు ఐక్యం కావాలని, అమరవీరుల ఆశయ సాధన కోసం ప్రజా పోరాటాల నిర్మాణమే ఏకైక మార్గమని ఎం సిపిఐ (యు ) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్ది కాయల అశోక్ ఓంకార్, సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి లు అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (యస్) మండలం ఏపూరు గ్రామంలో సిపిఎం మండల కార్యదర్శి కామ్రేడ్ అవిరె అప్పయ్య అధ్యక్షతన ఏపూరు ఎర్రజెండా ముద్దు బిడ్డ వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు అసెంబ్లీ టైగర్ అమరజీవి కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ శతజయంతి వార్షికోత్సవం సందర్భంగా ఆయన సొంత గ్రామం ఏపూరు నుండిఅమర జ్యోతి ప్రారంభ సభ జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూమాట్లాడుతూ ఏపూరు గ్రామంలో మద్ది కాయల రామయ్య అనంతలక్ష్మి ప్రథమ కుమారునిగా జన్మించిన కామ్రేడ్ ఓంకార్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అనేక నిర్బంధాలు ఎదుర్కొంటు భూమి, భుక్తి, విముక్తి పోరాటం లో అగ్రభాగాన నిలిచినారు అని, సాయుధ పోరాట విరమణ తరువాత నర్సంపేట నుంచి అసెంబ్లీ కి ఎన్నికై అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పోరాడిన తీరు అన్ని వర్గాలకు ఆదర్శం అని పలితంగా సహించని భూస్వాములు, పెత్తందార్లు ఓంకార్ గారిపై అనేక సార్లు హత్యాప్రయత్నం లు చేశారు అని దానిలో భాగంగా ఓల్డ్ యం యల్ ఏ క్వార్టర్స్ లో బాంబు దాడులు జరిగాయి అని ఇలా నిత్యం ప్రాణాలు చేతిలో పెట్టుకొని ప్రజల సమస్యలకు పరిష్కారం కావాలని రాజి లేని పోరాటం చేసిన ఓంకార్ గారు ఉమ్మడి నల్గొండ ఏపూరు బిడ్డ ఓంకార్ గారు కావడం, ఎర్రజెండా ముద్దు బిడ్డలు భీం రెడ్డి నర్సింహా రెడ్డి, మల్లు స్వరాజ్యం కూడా సాయుధ పోరాటానికి నేతృత్వం వహించటమే కాకుండా చట్ట సభల్లో కూడా ప్రజా సమస్యలపై పోరాడి వన్నె తెచ్చిన నేతలు అని ఓంకార్ తో కలిసి చేసిన పోరాటాలు త్యాగాలు నేటి తరానికి ఆదర్శం అని అన్నారు. అంతకుముందు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించారు.ఈ సభలో ప్రజానాట్యమండలి కళాకారులు ఆలపించిన అమరవీరుల గేయాలు ప్రజలను విశేషంగా ఆకర్షించాయి. సభ అనంతరం ఓంకార్ శత జయంతి సందర్భంగా అమర జ్యోతి ని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి ప్రారంభించారు. అనంతరంగ్రామంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎం సిపిఐ (యూ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, ఓంకార్ పెద్ద కుమారుడు మద్ది కాయల సుధాకర్, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, ఎం సిపిఐ( యూ) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వరికుప్పల వెంకన్న, వస్కుల మట్టయ్య, జిల్లా కార్యదర్శి షేక్ నజీర్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు, కోట గోపి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దండ వెంకటరెడ్డి, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, ధనియాకుల శ్రీకాంత్, వేల్పుల వెంకన్న, వీరబోయిన రవి, బెల్లంకొండ సత్యనారాయణ, ఓంకార్ కోడలు మద్ది కాయల ప్రభావతి, ఎం సిపిఐ (యూ)నాయకులు వస్కుల సైదమ్మ, ఏపూరి సోమన్న, నక్క శ్రీనివాస్, పోతుగంటి కాశి, సిపిఎం సీనియర్ నాయకులు అబ్బ గాని బిక్షం సిపిఎం మండల కమిటీ సభ్యులు సాన బోయిన ఉపేందర్, నూకల గిరి ప్రసాద్ రెడ్డి, వరికుప్పల మహేష్ , ఎరుకలి నాగరాజు, నాయకులు యాతాకుల వెంకన్న, న్యూ డెమోక్రసీ నాయకులు సూదగాని వెంకన్న, జిలేరు, ప్రజానాట్యమండలి జిల్లా నాయకులు బచ్చల కూర రాంబాబు, కాంపాటి శ్రీను, శ్రీకాంత్, పిడమర్తి అశోక్ తదితరులు పాల్గొన్నారు.