శ్రీ గోదా చెన్నకేశవస్వామి తిరుక్కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు

Jan 13, 2025 - 19:13
Jan 13, 2025 - 19:22
 0  0
శ్రీ గోదా చెన్నకేశవస్వామి  తిరుక్కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్:- ఆత్మకూరు మండల కేంద్రంలో వైభవంగా శ్రీ గోదా చెన్నకేశవస్వామి తిరుక్కళ్యాణోత్సవం ఆత్మకూరు మండల కేంద్రంలోని లోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాల ముగింపు సందర్బంగా శనివారం శ్రీ గోదాదేవి చెన్నకేశవస్వామి కళ్యాణం వైభవముగా జరిగింది. ఆలయ అనువంశిక అర్చక స్వాములు శ్రీమాన్ నూగూరు వేంకట రంగాచార్యులు,శ్రీనివాసాచార్యులు, రమాకాంతాచార్యులు,శ్రీకాంత్ ఆచార్యులు రామ్మోహనాచార్యులు పుష్పములు ఫలములుతో ప్రత్యేకంగా అలంకరించిన శ్రీ గోదారంగమన్నార్ కళ్యాణ మండపంలో ఆభరణాలు, పుష్పమాలలతో విశేషంగా సుందరమైన వేంచేపుతో శ్రీ గోదాదేవి చెన్నకేశవ స్వామి వారికి కంకణ ధారణ చేయించి వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు. కళ్యాణం అనంతరం చివరగా నివేదన, మంగళ హారతితో కళ్యాణ వేడుక ముగిసింది.ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు, గోదాకృష్ణ గోష్ఠిబృందం పురప్రముఖులు,భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.