కంచనపల్లి కస్తూర్బా స్కూల్ లో బాల్య వివాహాలపై అవగాహన సదస్సు

Dec 11, 2025 - 20:24
 0  43
కంచనపల్లి కస్తూర్బా స్కూల్ లో బాల్య వివాహాలపై అవగాహన సదస్సు

 అడ్డగూడూరు 11 డిసెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాక్సెస్ టు జస్టిస్ మరియు జస్ట్ రైట్స్ వారి సౌజన్యంతో "స్కోప్" స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అడ్డగూడూరు మండల పరిధిలోని కంచనపల్లి కస్తూర్బా పాఠశాలలో వందరోజుల కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహాలు,బాల కార్మికుల నిర్మూలన, మరియు బాలల హక్కులపై అవగాహన కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో స్కోప్ సంస్థ మండల కోఆర్డినేటర్ కురిమేటి యాదయ్య మాట్లాడుతూ.. బాల్యవివాహరహిత భారతదేశం కోసం ఏడు దేశాలలో ఈ కార్యక్రమం మహాయజ్ఞంగా జరుగుతుందని అన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలలో బాల బాలికలకు బాల్యవివాహ నిర్మూలన చట్టం 2006 గురించి వివరించడం జరుగుతుందని అన్నారు. పాఠశాల ఇన్చార్జి ఎస్ఓ శ్వేత అశ్విని మాట్లాడుతూ..బాల్య వివాహ రహిత భారత్ కొరకు "స్కోప్" సంస్థ ద్వారా ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి అవగాహన వల్ల పాఠశాల స్థాయి నుంచి పిల్లలు మానసికంగా దృఢంగా ఉండాలంటే ఈ అవగాహన చాలా అవసరం అన్నారు.ఈ కార్యక్రమం అనంతరం విద్యార్థినీల చేత బాల్య వివాహాల ప్రయత్నాలు మీ దృష్టికి వస్తే 1098కి మరియు పోలీస్ శాఖ 100కి కాల్ చేయాలని ప్రతిజ్ఞ చేయించారు. ఉపాధ్యాయినీలు జి నవ్య,సిహెచ్ ఉమా రాణి,వై సునీత కళాశాల ప్రథమ సంవత్సరం విద్యార్థినిలు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333