ఐదవ శక్తిపీఠం అలంపూర్ శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి
జోగులాంబ గద్వాల 27 జూన్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- దేశంలో ఐదవ శక్తిపీఠం, తెలంగాణలో ఏకైక శక్తిపీఠం అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవాలయాలను గద్వాల ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి కళ్యాణ చక్రవర్తి దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి ఉభయ దేవాలయాలలో అర్చనలు, కుంకుమార్చనలు నిర్వహించి స్వామి వారి, అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఉన్నారు.