మరో డంపింగ్ యార్డ్ తలపిస్తున్న దృశ్యం
న్యూ హౌసింగ్ బోర్డ్ మహేంద్ర షోరూం ప్రక్కన, మరియు రూరల్ పోలీస్ స్టేషన్ పక్కన చెత్తను తొలగించాలి
జోగులాంబ గద్వాల 27 జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల జిల్లా కేంద్రంలోని న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీ దగ్గర ఉన్న మహేంద్ర షోరూం ( పోలీస్ స్టేషన్ పక్కన ) చాలా రోజులుగా చెత్త చెదారం పేరుకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కాలనీవాసులు తెలిపారు. చాలా రోజుల నుంచి చెత్త చెదారం పేరుకపోవడంతో దోమల బెడద ఎక్కువగా ఉన్నదని వర్ష కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఇట్టి విషయాన్ని మున్సిపల్ అధికారులు, మున్సిపల్ చైర్ పర్సన్ మరియు అ వార్డు కౌన్సిలర్ స్పందించి చెత్తాచెదారాన్ని తొలగించాలని కాలనీవాసులు కోరుతున్నారు.