ఏలూరి శ్రీనివాసరావు ని పరామర్శించి యోగక్షేమాలు అడిగి
పాలేరు నియోజకవర్గం....... నేలకొండపల్లి మండలం ముఠా పురం గ్రామం లో ఇటీవల రోడ్డు ప్రమాదం లో గాయపడిన తెలుగుదేశం గ్రామ శాఖ అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు ని పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరంనాచేపల్లి గ్రామం లో ఇటీవల చనిపోయిన రాయల సీతమ్మ దశ దిన కార్యక్రమం లో పాల్గొని నివాళులర్పించారు. ఈ కార్యక్రమాలలోతెలుగు దేశం పాలేరు నియోజక వర్గ ఇంచార్జి కొండబాల కరుణాకర్, జిల్లా కార్యదర్శి నల్లమాస మల్లయ్య, లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లెంపాటి అప్పారావు, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి నున్నా నవీన్, జిల్లా నాయకులు పాలడుగు కృష్ణ ప్రసాద్, రాయల కోటేశ్వరరావు, మాజీ సర్పంచ్ పచ్చ సీతారామయ్య, పార్టీ గ్రామ శాఖ అధ్యక్ష కార్యదర్శులు పచ్చ జనార్ధన్, గారపాటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.