ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాతనే గ్రూప్ 1, 2, 3 ఫలితాలను విడుదల చేయాలి

Mar 9, 2025 - 16:11
 0  17
ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాతనే గ్రూప్ 1, 2, 3 ఫలితాలను విడుదల చేయాలి

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాతనే గ్రూప్ 1, 2, 3 ఫలితాలను విడుదల చేయాలి ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరవధిక దీక్షలు చేపట్టిన నాయకులు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంత వరకు గ్రూప్1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలతో పాటు అన్ని రకాల ఉద్యోగ పరీక్ష ఫలితాలను నిలుపుధల చేయాలని .ఆదివారం ఆత్మకూరు ఎస్ కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాతనే ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరవధిక దీక్షలను చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మేడి కృష్ణ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చేయడంతో పాటు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ చేయకుండా రిజర్వేషన్లు కేటాయించకుండా ఉద్యోగ నియామక ఫలితాలను విడుదల చేయడంతో మాదిగ నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎస్సీ వర్గీకరణ చేపట్టిన తర్వాతనే ఉద్యోగ నియామక ఫలితాలు విడుదల చేయాలని అప్పటివరకు ఫలితాల విడుదలను నిలుపుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి తిప్పర్తి గంగరాజు మాదిగ,ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షులు పెడమర్తి ఉమేష్ మాదిగ ఎమ్మార్పీఎస్ మండల అధికారి ప్రతినిధి మిరియాల చిన్ని మాదిగ పిడమర్తి పొట్ట పెంజర మురళి మాదిగ, పాల్వాయి వెంకటేష్ మాదిగ, పిడపర్తి వెంకటేష్ మాదిగ, బత్తుల వీరయ్య మాదిగ, పద్ధపురపు మహేష్ మాదిగ, బత్తుల వెంకటేష్ మాదిగ, మిర్యాల రమేష్ మాదిగ, బత్తుల శీను మాదిగ, బత్తుల మహేష్ మాదిగ, దావూర వెంకటేష్ మాదిగ, మహేష్ మాదిగ, బత్తుల శ్రావణ్ మాదిగ, బత్తుల శేఖర్ మాదిగ, కళ్యాణ్ మాదిగ, మహేష్ మాదిగ, తదితరులు ఉన్నారు.