సారపాక లో నూతన పోలీస్ స్టేషన్ నిర్మించాలి

సారపాక లో నూతన పోలీస్ స్టేషన్ నిర్మించాలి అని తెలంగాణ రాష్ట్ర డీజీపీ కి మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కి- జాతీయ మానవ హక్కుల సంఘం NHRCOI విజ్ఞప్తి.

Mar 9, 2025 - 14:19
Mar 9, 2025 - 14:25
 0  88
సారపాక లో నూతన పోలీస్ స్టేషన్ నిర్మించాలి

బూర్గంపాడు, 09 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-

బూర్గంపాడు మండల పరిధిలో ఒక పోలీస్ స్టేషన్ ఉంది కానీ, స్టేషన్ యొక్క పరిధిలో అనేక గ్రామాలు ఉన్నాయి. అయితే ఒక ఫిర్యాదు మీద స్టేషన్ కి వెళ్లాలంటే బూర్గంపాడు మండలానికి లోపలికి ఉన్న స్టేషన్ కి దూర ప్రాంతాలలో ఏదైనా క్రైమ్ జరిగిన వారు వచ్చి ఫిర్యాదు ఇవ్వడానికైనా లేకపోతే, ఇలా సమస్య మీద 100 డయల్ చేస్తే వారు ఆ చివర నుంచి ఈ చివరకి వచ్చేసరికి అప్పటికే మొత్తం అయిపోతుంది. అలాగే మండల పరిధిలో అత్యధిక క్రైమ్ రేట్ గల ప్రాంతాలు స్టేషన్ కి దూరంగానే ఉన్నాయి. అవి సారపాక కు దగ్గరగా ఉన్న ప్రాంతాలు కావున బూర్గంపాడు స్టేషన్ నుంచి పెట్రోలింగ్ వాహనాలు ఎన్ని ఉన్నా వారు రోజు అంత కష్టం చేయలేరు కాబట్టి సారపాక ప్రాంతంలో ఒక నూతన పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి క్రైమ్ రేట్ తగ్గించగలరని, అలాగే పేపర్ బోర్డులో జరిగే వాటి మీద చర్యలు వేగవంతంగా తీసుకోవడానికి మరియు సారపాకలో పోలీస్ స్టేషన్ ఉండడం వలన నిరంతర గస్తీ ఉండటం వలన గాంధీనగర్ లాంటి ఏరియాలలో అసాంఘిక కార్యకలాపాలు మరియు యాంటీ సోషల్ యాక్టివిటీస్ జరగకుండా, ఆకతాయిలకు అడ్డుకట్టగా అలాగే, సారపాక జంక్షన్ వద్ద అనునిత్యం చెక్ పోస్ట్ ద్వారా గంజాయి తరలింపుకు పూర్తిస్థాయిలో నిర్మూలించవచ్చు. కావున సారపాకలో ఒక నూతన పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి క్రైమ్ రేట్ తగ్గించగలరని తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఉన్నత అధికారి, తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి, మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీకి విజ్ఞప్తి చేస్తున్నాం.

*ఈ కార్యక్రమంలో లో గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి ,పోడుతూరి ప్రేమ్ సాయి, గుగులోతు బాబు.*

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333