ఎస్సీ బాలికల వసతిగృహంలో అవినీతి అధికారి

Apr 15, 2025 - 21:15
 0  278
ఎస్సీ బాలికల వసతిగృహంలో అవినీతి అధికారి

ప్రభుత్వ అధికారులు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు

జిల్లా ఏసీబీ అధికారి జగదీష్ చందర్

వసతి గృహంలో ఎక్కువ విద్యార్థులు, పూర్తి స్థాయిలో రికార్డులు లేకపోవడంపై అధికారుల ఆగ్రహం

తుంగతుర్తి 15 ఏప్రిల్  2025 తెలంగాణ వార్త రిపోర్టర్

సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి ఎస్సీ బాలికల వసతి గృహంలో వసతి గృహ అధికారిని నిర్లక్ష్యపు సమాధానం, విద్యార్థులు ఎక్కువ రికార్డు చూపడం, అరకొర వసతులు ఉండడంతో రాష్ట్ర అధికారుల ఆదేశం మేరకు బాలికల వసతి గృహం పై ఏసీబీ దాడులు చేసిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. జిల్లా ఏసీబీ అధికారి జగదీష్ చందర్ తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్ర డిజిపి ఆదేశాల మేరకు రాష్ట్రంలో పలు సంక్షేమ హాస్టల్లో అవినీతి జరుగుతున్నట్లు ఫిర్యాదు మేరకు తుంగతుర్తి మండల కేంద్రంలోని ఎస్సీ బాలికల వసతి గృహానికి 6 గంటలకు వచ్చి సుమారు 4 గంటల వరకు సంబంధిత వసతి గృహ అధికారి మార్తమ్మ సహా కలిసే రికార్డును పరిశీలించినట్లు పేర్కొన్నారు. ప్రతిరోజు వసతి గృహానికి 25 మంది విద్యార్థులు ఉండగా రికార్డులు 51 మంది విద్యార్థులు ఉన్నట్లు ఫుడ్ ఇన్స్పెక్టర్ స్వాతి ,ఆడిటర్ ప్రణయ్ శానిటరీ ఇన్స్పెక్టర్ నాగరాజు లీగల్ మెట్రాలజీ అధికారి చిట్టి బాబులతో కలిసి పూర్తిస్థాయిలో విచారణ చేసినట్లు తెలిపారు., అదనంగా ఫుడ్ మెటీరియల్స్ తీసుకొని, ప్రభుత్వాన్ని నష్టపరుస్తున్నట్లు గ్రహించినట్లు తెలుపుతూ పూర్తి నివేదికను జిల్లా, రాష్ట్ర ఉన్నత అధికారులకు పంపనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034