ఎరువులను తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి వెంకటరమణరెడ్డి

Jan 30, 2026 - 20:08
 0  2

 అడ్డగూడూరు 30 జనవరి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– అడ్డగూడూరు మండల కేంద్రంలో వివిధ గ్రామాలలో ఫెర్టిలైజర్ షాపులను జిల్లా వ్యవసాయ అధికారి పి వెంకట రమణ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు.అడ్డగూడూరు మండల పరిధిలోని కాంచనపల్లిలో ఎక్స్ రోడ్డులో కిసాన్ అగ్రిమాల్ అడ్డగూడూరులోని ధనలక్ష్మి ఇంటర్ప్రైస్స్,ఆర్.సి.ఎస్ ఫార్మ్స్ హబ్,ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మరియు చౌళ్ళరామారం గ్రామంలోని అగ్రి రైతు సేవ కేంద్రం ఫర్టిలైజర్ షాప్స్ లను సందర్శించి రిజిస్టర్లను తనిఖీ చేసారు.ఇందులో భాగంగా యూరియా ఇతర ఎరువుల నిల్వలను ఎప్పటికప్పుడు స్టాక్ బోర్డులో ప్రదర్శించాలని అలాగే ఎరువులు అమ్మగానే ఆన్లైన్ లో ఫిలప్ చేసి స్టాక్ రెజిస్టర్స్ అప్డేట్ చేయాలనీ డీలర్స్ కి  సూచించారు.అలాగే యూరియా కొరత ఇప్పుడు ఏమి లేదని రైతులను కోరారు.రైతులు కూడా ఒకేసారి మొత్తంలో ఎరువులు కొనుగోలు చేయొద్దు అని అన్నారు.ఏ సీజన్లో కావలసిన ఎరువులను అప్పుడే కొనుగోలు చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల ఏవో పాండురంగ చారి వివిధ షాపుల యజమానులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333