ఎమ్మెల్యే పార్టీ మారితే అంటించుకుంట.. కె టి దొడ్డి మండల కేంద్రము లో పెట్రోల్ పోసుకున వ్యక్తి
జోగులాంబ గద్వాల 4 జులై 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి: కె టి దొడ్డి గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారనే ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో నియోజకవర్గంలో జడ్పీ చైర్ పర్సన్ సరితమ్మ అభిమానులు కార్యక్తలు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసన చేపడుతున్నారు.ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవొద్దంటూ ఆందోళన చేపట్టారు. సరితా తిరుపతయ్యకు ఆ పార్టీ నాయకులు వినతిపత్రాలు అందజేశారు. గురువారం మండల కేంద్రంలోని రోడ్డుపై సరితాతిరుపతయ్య అభిమాని H. కృష్ణ (32) పెట్రోల్ పోసుకొని MLA కాంగ్రెస్ పార్టీ లోకి రాకూడదు అని హెచ్చరించారు....
ఈ కార్యక్రమంలో ఆనంద్ గౌడ్, గుంతబాయ్ శ్రీను, చింతలకుంట గోవర్ధన్,శేషాద్రి, మునెప్ప నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకలు మరియు గ్రామ నాయకులు సరితమ్మా అభిమానులు,ప్రజలు పాల్గొన్నారు.