శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి

తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బూర్గుల నాగేందర్ మాదిగ, తక్కల్లపల్లి రాజేందర్ మాదిగ*

Jul 4, 2024 - 19:15
Jul 4, 2024 - 19:20
 0  13
శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి

హైదరాబాద్, జూలై 4 :- కుల సంఘాల పేరుతో జర్నలిస్టు అసోసియేషన్లు ఏర్పాటు చేయడం తగదని ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బూర్గుల నాగేందర్ మాదిగ, తక్కల్లపల్లి రాజేందర్ మాదిగ డిమాండ్ చేశారు. బుధవారం వారు హైదరాబాదులో విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా కుల సంఘాలు పెట్టి తమ హక్కుల కోసం ఉద్యమించవచ్చని పేర్కొన్నారు. కుల సంఘాల పేరిట జర్నలిస్టు సంఘాలు ఏర్పడితే ఏం ఆందోళన కలుగుతుందో శ్రీనివాస్ రెడ్డి సమాధానం చెప్పాలని అన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ హోదాలో ఉండి ఆయన చేసిన వ్యాఖ్యలు దళిత, బహుజన వర్గాల జర్నలిస్టులను అవమానించేకరంగా ఉన్నాయన్నారు. దేశంలో కులాన్ని రద్దు చేస్తే ఎలాంటి కుల సంఘాలు ఏర్పాటు కాబోవని చెప్పారు. దేశంలో కులం ఉన్నది కాబట్టే ఆయ కులాల ప్రజలు సంఘాలను నిర్మాణం చేసి వారి హక్కుల కోసం పోరాడుతున్నారని గుర్తు చేశారు. తెలంగాణలో ఎంతోమంది అనేక మంది జర్నలిస్టుల పైన దాడులు, అక్రమ కేసులు ,వేధింపులు జరిగితే పట్టించుకోని సంఘాలు నేడు కుల జర్నలిస్టు సంఘాలు పెట్టొద్దని అనటం సరికాదన్నారు. తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీ సమాజాలలోని మున్నూరు కాపు, గౌడ, యాదవ, ముదిరాజు, లంబాడ ,మాదిగ, మాల తదితర జర్నలిస్టు సంఘాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఆయా కులాల జర్నలిస్టులు ఎందుకు సంఘం పెట్టాల్సి వచ్చిందో శ్రీనివాస్ రెడ్డికి తెలుసు అన్నారు. దేశంలో కులాల పేరిట ఏర్పడిన సంఘాలన్నీ వారి హక్కులు, స్వయం రక్షణను కాపాడుకోవడం కోసమే ఉద్భవించాయని చెప్పారు. కుల సంఘాల పేరిట యూనియన్లు సరికావన్న శ్రీనివాస్ రెడ్డి గత ఏడాది గత ప్రభుత్వం హైదరాబాదులో రాష్ట్రస్థాయి దళిత జర్నలిస్టులకు శిక్షణ తరగతులు ఎందుకు ఏర్పాటు చేసిందో స్పష్టం చేయాలన్నారు. జర్నలిస్టుల అభివృద్ధి కి కాకుండా యాజమాన్యాల ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటుకు ఉపయోగపడే 239 జీవో ను ఎంపానల్ మెంట్ ఉన్న పత్రికలలో పనిచేసే జర్నలిస్ట్లకు మాత్రమే అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వండి అని ప్రభుత్వం తెచ్చిన జీవో కు మద్దతుగా మాట్లాడిన జర్నలిస్టు సంఘమేదో ఆనాటి ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం వెయ్యి కోట్లు కేటాయించక పోయినా కేటాయించింది అని చెప్పినా ఆనాటి ప్రభుత్వానికి వంత పాడి జీవం పోసిందెవరో జర్నలిస్ట్ లోకానికి తెలుసు అన్నారు. పీడనకు గురయ్యే వర్గాల జర్నలిస్టుల ఆవేదన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఉద్యమాల ద్వారా తమ హక్కులను కాపాడుకునేందుకు సంఘాలు ఏర్పడుతున్నాయని తెలిపారు. వారి వెంట రాష్ట్ర ఉపాధ్యక్షులు కాటేపాగ హుస్సేన్ మాదిగ, రాష్ట్ర కార్యదర్శి సుక్క అశోక్ మాదిగ ,అంకగళ్ల కరుణాకర్ మాదిగ, దుబ్బ నాగేష్ మాదిగ, చింత ప్రవీణ్ మాదిగ ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333