ఎన్.పి.ఆర్.డి రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి
జిల్లా కార్యదర్శి వనం ఉపేందర్
అడ్డగూడూరు 10 మే 2026 తెలంగాణవార్త రిపోర్టర్:-యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని గట్టుసింగరం గ్రామంలో ఎన్. పి.ఆర్.డి సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ..అడ్డగూడూరు మండల వ్యాప్తంగా ఉన్న వికలాంగుల సమస్యలు పరిష్కారం కావాలని ఈ మండలంలో వికలాంగుల సర్టిఫికెట్ వచ్చి మూడు సంవత్సరాలు గడిచిన పెన్షన్ వచ్చే పరిస్థితి లేదు అన్ని అన్నారు.గవర్నమెంట్ బడ్జెట్ లేదని ఇప్పటికి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదని వెంటనే కొత్త పెన్షన్ డబ్బులు ఇవ్వాలని అడ్డగూడూరు మండలంలో వికలాంగుల అయి ఉన్న సదరం సర్టిఫికెట్లు రాక చాలామంది ఉన్నారు వెంటనే వాళ్లకు కొత్తగా సదరం సర్టిఫికెట్ తోపాటు యూ. డి.ఐ.డి కార్డు అమలు చేయాలి వికలాంగులకు 5శాతం కలిగి ఉన్న అడ్డగూడూరు మండలంలో వికలాంగులకు ఇందిరమ్మ ఇల్లు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే వికలాంగులకు ఇండ్లు కట్టించాలని అడ్డగూడూరు మండలంలో వికలాంగులు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న ఉపాధి పథకంలో కూలి దొరుకుతుందని ఆశ ఉన్న చేద్దామంటే కూలి పనులు పెట్టే పరిస్థితి లేదు..ఇప్పటికైనా ఉపాది హామీ పథకం లో గతంలో 150 రోజులు పని కల్పించే అవకాశం వచ్చింది ఇప్పుడు పని కల్పించే పరిస్థితి లేదు వెంటనే వికలాంగులకు వాళ్లు చేసే పని సపరేట్గా పనిచేసేటట్టు కల్పించాలి ఉపాధి హామీ పథకంలో 150రోజులు పని కల్పించి రోజుకు 600 రూపాయలు కూలి ఇవ్వాలని రాష్ట్రంలోని వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కొరకు రాబోయే కాలంలో జరపాల్సిన హక్కుల పోరాటాల కార్యాచరణను రూపొందించడం కోసం ఈనెల 29,30,31తేదీలలో యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో రాష్ట్ర సదస్సు నిర్వహించడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. అందుకోసం జిల్లా వ్యాప్తంగా మండలాల నుండి 17గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమానికి జిల్లా ఉపాధ్యక్షులు చిత్తలూరి శ్రీహరి గట్టుసింగారం గ్రామ అధ్యక్షులు మద్ది వీరయ్య,ప్రధాన కార్యదర్శి కేశపోయిన రవి,ఉపాధ్యక్షులు వల్లపు లింగమయ్య సహాయ కార్యదర్శి జంపాల,సోమ నర్సయ్య,కోశాధికారి అలువాల మంజుల,నిమ్మల వెంకన్న,వేముల రాములు,మధ్య లింగమ్మ తదితరులు పాల్గొన్నారు.