ఇక నుంచి డిఎస్పీ కార్యాలయాల్లో కూడా పోలీసు ప్రజావాణి కార్యక్రమం.
పిర్యాదుదారులు, బాధితులు సద్వినియోగం చేసుకోవాలి.
ఇక పై ప్రతి సోమవారం డివిజన్ స్థాయిలో డిఎస్పీ కార్యాలయాల్లో కూడా పోలీస్ ప్రజావాణి కార్యక్రమం.
డివిజన్ పరిధిలోని ప్రజలు వారి సమస్యలను డిఎస్పీ కార్యాలయంలో నిర్వహించే పోలీస్ ప్రజావాణి కార్యక్రమంలో డిఎస్పీ లకు పిర్యాదులు చేయొచ్చు. ఇక పై ప్రతి సోమవారం కోదాడ, సూర్యాపేట డిఎస్పీ కార్యాలయాలలో పోలీస్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. డిఎస్పీ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేయాలని డీఎస్పీలు లను ఎస్పి ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహిస్తున్న పోలీస్ ప్రజావాణి కార్యక్రమం డిఎస్పీ కార్యాలయాల్లో కూడా నిర్వహించడం జరుగుతున్నదని అన్నారు, పిర్యాదుదారుల సౌలభ్యం, ప్రభుత్వ ఆదేశాల మేరకు డిఎస్పీ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రజలు, బాధితులు, పిర్యాదుదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.