ఉపాధి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్
తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ నెమ్మికల్ లో ఉపాధి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్. ఆత్మకూర్( ఎస్ ) మండలం నెమ్మికల్ లో జరుగుతున్న ఉపాధి పనులను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ గురువారం సందర్శించి కూలీల తో మాట్లాడారు. వడదెబ్బ తగలకుండా ఉదయం 6గంటలకు వచ్చి 10గంటలకు వెళ్లిపోవాలని కోరారు. కూలీల డబ్బులు సకాలంలో వస్తున్నాయా అంటూ అడిగి తెలుసుకున్నారు. మహిళా కూలీలతో మాట్లాడుతూ పిల్లలను చక్కగా చదివించాలాని కోరారు. కాగా గడ్డపారలు, పారలు పంపిణీ చేయాలని పలువురు కూలీలు కోరగా ఇప్పుడు అలాంటి ప్రొవిజన్ లేదన్నారు.పని ప్రదేశంలో నీడ, తాగునీరు, ప్రధమ చికిత్స సౌకర్యాలు గురించి వాకబు చేశారు. కార్యక్రమం లో జిల్లా అడిషనల్ drdo చంద్ర శేఖర్, apd పవన్ కుమార్, ఎంపీడీఓ ఎండీ. హసీం, గ్రామ సర్పంచ్ జటంగి గణిత, ఉప సర్పంచ్ చెరకుపల్లి సృజన,పంచాయతీ కార్యదర్శి దీప్తి,ఈసీ అరుణ జ్యోతి, సాంకేతిక సహాయకులు రాము, క్షేత్ర సహాయకులు అంజమ్మ,తదితరులు పాల్గొన్నారు.