పీఏసీఎస్‌ల రద్దు

Apr 30, 2026 - 18:43
 0  1
పీఏసీఎస్‌ల రద్దు

చెల్లదు పాత సొసైటీలను కొనసాగించాల్సిందే
ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు_
రేవంత్‌ సర్కార్‌కు ఎదురుదెబ్బ
కేటీఆర్‌కు ప్యాక్స్‌ అధ్యక్షుల_ కృతజ్ఞతలు

రాజన్న సిరిసిల్ల : రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ప్రభుత్వం పాలనాధికారులను, నామినేటెడ్‌ పాలకవర్గాలను నియమించడం సరికాదని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నాలుగు నెలల అవిశ్రాంత పోరాటం ఫలితంగా బుధవారం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పీఏసీఎస్‌ చైర్మన్లకు శుభవార్త చెప్పింది. 2025 ఫిబ్రవరి 14న ఏ పాలకవర్గాలైతే ఎక్స్‌టెన్షన్‌ తీసుకున్నాయో అవన్నీ తిరిగి పదవీ బాధ్యతలు చేపట్టాలని తీర్పు వెలువరించింది. పీఏసీఎస్‌ పాలకవర్గాలను రద్దు చేస్తూ, వాటి స్థానంలో పర్సన్‌ ఇన్‌చార్జులను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం జారీ చేసిన 597 జీవోను ప్రభుత్వమే ఉపసంహరించుకోవడంతో పాలకవర్గాలు తిరిగి బాధ్యతలు చేపట్టడానికి మార్గం సుగమమైంది. హైకోర్టులో సహకార సంఘాల తరఫున పోరాటం చేసిన న్యాయవాది నెలవెల్లి అశోక్‌ను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఘనంగా సన్మానించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333