ఉచిత పథకాలు రద్దుచేసి విద్య వైద్యం  అందించాలి

May 6, 2025 - 19:32
 0  47
ఉచిత పథకాలు రద్దుచేసి విద్య వైద్యం  అందించాలి

 ఎకరంలోపు వ్యవసాయ భూములకు నాలా కన్వర్షన్ మీద  రిజిస్ట్రేషన్ చేయాలి .

 జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్  అధ్యక్షుడు, తెలంగాణ  సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్.

 (సూర్యాపేట టౌన్, మే 06) :  రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న అనవసరమైన ఉచిత పథకాలు రద్దుచేసి ప్రజలకు కావలసిన నాణ్యమైన విద్య, వైద్యాన్ని పూర్తిస్థాయిలో ఉచితంగా అందించాలని తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రం నుండి  విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాలు ఉచిత పథకాల పేరుతో గొప్పలకు పోయి వేలాది కోట్ల రూపాయలు వృధా చేస్తున్నారని మండిపడ్డారు. నిజంగా ప్రజలకు అవసరమయ్యే విద్య, వైద్యాన్ని పూర్తిస్థాయిలో ఉచితంగా అందిస్తే ప్రజలందరూ స్వాగతిస్తారని తెలిపారు. ఉచిత విద్య అందిస్తే ఎంతోమంది నిరుపేదల పిల్లలు ఉన్నత చదువులు చదివి భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో  జబ్బు చేస్తే ఆసుపత్రుల్లో వైద్యం ఖర్చు భరించే శక్తి లేక  వైద్యానికి దూరమై ఎంతోమంది పేదల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం బడ్జెట్లో విద్య, వైద్య రంగానికి భారీగా నిధులు కేటాయించి ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. ఉచిత బస్సు పథకం అంత ఉపయోగకరంగా లేదని చెప్పారు. ఉచిత బస్సు ప్రయాణం మంచిదే అయినప్పటికీ బస్సుల్లో పురుషులు ప్రయాణించేందుకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని  మహిళల సిగపట్లు తప్పడం లేదని చెప్పారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూరే విధంగా దృష్టి పెట్టి పాలన కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఉచితల పేరుతో ప్రభుత్వం చేసే అప్పులకు ప్రజల పై పన్నుల భారం పడుతుందని విమర్శించారు. ప్రజలకు కావలసిన విద్య,వైద్యం తో పాటు నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పేదలకు పక్కా గృహాలు నిర్మించి ఇస్తే అంతకన్నా అవసరాలు ప్రజలు ప్రభుత్వాలను అడగరని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం 58, 59 జీవో ప్రకారం ప్రభుత్వ భూముల్లో నివాస సముదాయాలు ఏర్పరచుకున్న వారికి రెగ్యులరైజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. పట్టేదారు పాసుపుస్తకాలు ఉండి ఎకరంలోపు ఉన్నటువంటి భూములకు నాలా కన్వర్షన్ మీద రిజిస్ట్రేషన్లు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్, జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కోశాధికారి పాల సైదులు, జిల్లా కార్యదర్శి ఖమ్మం పాటి అంజయ్య గౌడ్, పట్టణ కార్యదర్శి అయితే గాని మల్లయ్య గౌడ్, సహాయ కార్యదర్శి ఆకుల మారయ్య గౌడ్, పట్టేటి కిరణ్, పట్టణ గౌరవ సలహాదారుడు మాదిరెడ్డి గోపాల్ రెడ్డి, ఎస్.కె రషీద్, సారగాండ్ల కోటేశు, వెంకట్ రెడ్డి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333