ఉండవెల్లి మండలం అగ్ని ప్రమాదంలో పశుగ్రాసం నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

May 2, 2025 - 19:45
 0  66

 సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఏ వెంకటస్వామి

జోగులాంబ గద్వాల 2 మే 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: ఉండవెల్లి. మండలం ప్రాగటూరు గ్రామంలో మే ఒకటో తేదీ అర్ధరాత్రి గ్రామానికి చెందిన 12 మంది రైతులకు చెందిన పశుగ్రాసం ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని కాలిపోయింది ప్రమాదవశాత్తు జరిగిన ఈ సంఘటనలో పశుగ్రాసం వరిగడ్డి మినప పొట్టు పెసర పొట్టు, బుడ్డల కట్టే కందిపొట్టు తదితర పశుగ్రాసం కాలి పోయిన సంఘటన తెలుసుకుని గ్రామానికి వెళ్లి జిల్లా కమిటీ సభ్యులతో కలిసి కాలిపోయిన ప్రాంతాన్ని పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గ్రామానికి చెందిన 12 మంది రైతులకు చెందిన 18 వాములు పూర్తిగా మంటల్లో దగ్ధమయ్యాయని దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని, వాటితోపాటు  వ్యవసాయ పనిముట్లు ఎద్దుల బండ్లు నీటి పంపు మోటర్లు పైపులు తదితర సామాగ్రి కాలి బూడిదైందని పశువుల పాకలో కట్టేసిన పశువులు మంటల వేడికి తట్టుకోలేక అర్ధరాత్రి తాళ్లు తెంపుకొని వెళ్లాయని కొన్ని పశువులకు మంట సెగ తగిలి బొబ్బలు వచ్చాయని ఈసంఘటనలో పూర్తిగానష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలని అన్నారు. జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి నష్టపోయిన రైతులకు పరిహారం పూర్తిస్థాయిలో ఇచ్చే విధంగా కృషి చేయాలని కోరారు .ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు రేపల్లె దేవదాస్ సింగరాజు మద్దిలేటి జీకే ఈదన్న మండల కమిటీ సభ్యుడు ఎం వెంకటేశ్వర్లు శాఖ కార్యదర్శి కే మధు రంగన్న చెన్నరాయుడు హుస్సేను తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333