ఐజ గురుకుల పాఠశాల కొరకు పట్టువదని ఐజ అఖిలపక్ష కమిటీ నాయకులు  కలెక్టర్ కి వినతి

May 2, 2025 - 19:42
 0  7
ఐజ గురుకుల పాఠశాల కొరకు పట్టువదని ఐజ అఖిలపక్ష కమిటీ నాయకులు  కలెక్టర్ కి వినతి

జోగులాంబ గద్వాల 2 మే 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: ఐజ. గత కొన్ని సంవత్సరాల క్రితం ఐజ మండలానికి సోషల్ వెల్ఫేర్ గురుకుల బాలర పాఠశాల మంజూర్ అయింది. కొన్ని రోజులు ఐజ హైస్కూల్ నందు నడిపారు. అక్కడ మిగతా డేస్ కాలర్ కు ఇబ్బంది కావడం వల్ల ప్రైవేట్ బిల్డింగ్ లోకి మార్చుకుందామని అనుకునే లోపే కొన్ని ఇబ్బందుల వల్ల గద్వాల జిల్లాలోని ఎర్రవల్లి గ్రామానికి మార్చారు. ఐజ మండలానికి దక్కాల్సిన గురుకుల పాఠశాల ఇతర ప్రాంతాలకు తరలిపోవడం వల్ల ఇక్కడ విద్యార్థులు మరియు తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రుల కోరిక మేరకు ఎర్రవల్లి నుండి ఐజ మండలానికి కేంద్రానికి మార్చమని గతంలో మీకు చాలాసార్లు విన్నవించాం నాగర్ కర్నూల్ ఎంపీ శ్రీ మల్లు రవికి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కి,  ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డికి, మరియు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి  సంపత్ కుమార్  కూడా ఐజకు మార్చమని  తెలిపాం. ఐజ లో ఉన్న ప్రైవేట్ బిల్డింగ్ యాజమాన్యం కూడా అంగీకరించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెంటు మాట్లాడి ఐజకు గురుకుల పాఠశాలను వెంటనే మార్చుదామని  ఈ విద్యాసంవత్సరం నుండి ఇక్కడకు రప్పించే ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను కోరుచున్నాము.

ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నాగర దొడ్డి వెంకట రాములు, దండోరా ఆంజనేయులు, దండోరా హనుమంతు, టిడిపి నాయకులు సుధాకర్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు ముక్కెరన్న, మాచర్ల ప్రకాష్,BSP రాంబాబు, రమేశ చారి, కోళ్ల శంకర్, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333