ఇసుక లారీలు నిలిపివేత
ఇసుక లారీలు నిలిపివేత
చెరుకూర్ నుంచి ధర్మారం రోడ్డు ని త్వరగా నిర్మించాలి
వాజేడు, తెలంగాణ వార్త :- వాజేడు మండలంలోని ధర్మవరం నుండి చెరుకూరు వరకు గల రోడ్డు నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రజా పోరాట సమితి, బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు వాజేడు మండలం పేరూరు సర్కిల్ పరిధిలోని ఐదు గ్రామ పంచాయతీల్లో ఒక ప్రకటనలో తెలిపారు. రోడ్డు సౌకర్యం లేక ఈ ప్రాంత ప్రజలు, విద్యార్థులు, వృద్ధులు అత్యవసర సేవల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడం అత్యంత విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ప్రజా పోరాట సమితి ముఖ్య నాయకులు మాట్లాడుతూ ధర్మవరం, చెరుకూరు మధ్య 9.20 కిలోమీటర్ల రోడ్డు మంజూరైందని, ఇందులో రెవెన్యూ పరిధిలో ఉన్న 6. కిలోమీటర్ల మేర పనులు పూర్తయినప్పటికీ, మిగిలిన 3, కిలోమీటర్ల రోడ్డు అటవీ శాఖ పరిధిలో ఉండటం వల్ల నిలిచిపోయిందని వివరించారు. అటవీ శాఖ అనుమతుల కోసం రూ.47,50,000/-చెల్లించాలని ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు చెబుతున్నారని, అయితే డీఎఫ్తా ఇప్పటికే అనుమతులు ఇచ్చినట్లు తెలుస్తున్నా, ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా కాలయాపన చేస్తోందని మండిపడ్డారు.
ప్రజల రవాణాకు అత్యంత కీలకమైన ఈ రహదారి విషయంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పూర్తిగా నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నారని, వర్షాకాలం ప్రారంభం కావడంతో ఈ రహదారి పరిస్థితి
మరింత ఘోరంగా తయారై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల చుట్టూ, ప్రజాప్రతినిధుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా కేవలం కాలయాపన తప్ప ఎలాంటి శాశ్వత పరిష్కారం లభించలేదన్నారు.
ముఖ్య డిమాండ్లు:
ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య వైఖరిని వీడి, నిలిచిపోయిన 3 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలి.
అటవీ శాఖ అనుమతులకు సంబంధించిన నిధులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలి.ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న ఈ రోడ్డు సమస్య పరిష్కారం అయ్యేంత వరకు రోడ్డు నిర్మాణం చేయకుండా ఇసుక ర్యాంపుకి ఎలా అనుమతి, ప్రజా పోరాట సమితి, బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇసుక ర్యాంపు నిలిపివేయ్యాలి, ఎన్ని సార్లు, ప్రభుత్వంకి వినతిపత్రం ఇచ్చిన శున్యం రోడ్డు గురించి వినతిపత్రం ఇచ్చిన కనీసం, చిత్తశు ద్ది లేకుండా ఉండటం బాధాకరం, ఈ రోడ్డు కింద 8 గ్రామ పంచాయతీ ప్రజలు నివసిస్తారు, చిన్న పిల్లలు సైతం పక్కన చెరుకూరు పాఠశాల కి వేళ్తారు, గత కొద్ది సంవత్సరలో చాలా ప్రమాదాలు, ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది,
గతలో అంబులెన్సు సైతం దారి ఇవ్వని పరిస్థితి అది గుర్తించకుండా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది, వ్యక్తం, చేసారు, ఇసుక ర్యాంప్ లారీ లను ఆపు చేసాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగట్టు సాంబమూర్తి, ముత్తెబోయిన మహిందర్, ప్రజలు పాల్గొన్నారు.