సంఘాల పేరుతో విద్యాసంస్థలను ఇబ్బంది పెట్టవద్దు
సంఘాల పేరుతో విద్యాసంస్థలను ఇబ్బంది పెట్టవద్దు.
పాఠశాల వాతావరణాన్ని దెబ్బతీవద్దు.
విద్యాలయం ఆవరణంలో పెద్ద శబ్దాలతో నినాదాలు చేస్తూ విద్యార్థులను భయాందోళనకు గురి చేయొద్దు.
విద్యాసంస్థల్లో సమస్యలు ఉంటే అధికారులకు పిర్యాదులు చేస్తే సమస్యలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటారు.
విద్యార్థుల రవాణా బస్సులు అడ్డగించడం, చందాల రూపంలో డబ్బు వసూళ్లకు పాల్పడడం చట్ట విరుద్ధం.
....సూర్యాపేట డివిజన్ డీఎస్పీ ప్రసన్న కుమార్.
సూర్యాపేట. 27 జూన్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- ప్రవేట్ విద్యాసంస్థల ను సంఘాల పేరుతో ఇబ్బందులు, బెదిరింపులకు గురి చేస్తున్నారు అని వివిధ సమస్యలపై ప్రవేట్ విద్యాసంస్థల నుండి పిర్యాదు వస్తున్నాయి, గురువారం రోజున సూర్యాపేట జిల్లా కేంద్రంలో గల త్రివేణి పాఠశాల లోకి కొంత మంది వ్యక్తులు విద్యార్థి సంఘాల పేరుతో అక్రమంగా చొరబడి కార్యాలయం తాళాలు పగలగొట్టి, పెద్దగా నినాదాలు చేస్తూ విద్యార్థులను భయాందోళనకు గురిచేసిన విషయమై యాజమాన్యం పిర్యాదు మేరకు సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ నందు చట్టపరకారం క్రిమినల్ కేసు నమోదు చేశాం అని సూర్యాపేట డివిజన్ డీఎస్పీ ప్రసన్న కుమార్ ఒక ప్రకటనలో తెలిపినారు. విద్యార్థి సంఘాల పేరుతో విద్యార్థులకు అసౌకర్యం కలిగించవద్దు, విద్యాసంస్థల యాజమాన్యాలను, ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేయవద్దు అని ఈ సందర్భంగా వివిధ రకాల సంఘాలకు డీఎస్పీ సూచించారు. పాఠశాలల్లో, విద్యాసంస్థల్లో ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించడం, విద్యార్థులను రవాణా చేసే బస్సులను అడ్డుకోవడం, యాజమాన్యాలను లేదా ఉపాధ్యాయులను బెదిరించడం, పెద్ద శబ్దాలతో నినాదాలు చేస్తూ విద్యార్థులు భయపడేలా వాతావరణం సృష్టించడం, చందాల రూపంలో డబ్బు వసూళ్లు చేయడం వంటి చర్యలకు పాల్పడడం చట్ట విరుద్ధం అని హెచ్చరించారు.
ప్రవేటు విద్యాసంస్థల్లో ఏవైనా సమస్యలు ఉంటే, వాటిపై సంబంధిత జిల్లా అధికారులకు, విద్యాశాఖ అధికారులకు పిర్యాదు చేయాలి, సమస్యలపై అధికారులు నిబంధనల ప్రకారం విచారణ, దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకుంటారని తెలిపారు. అంతే కానీ, విద్యార్థి సంఘాల పేరు చెప్పుకుని పాఠశాలల్లో ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టించవద్దని, విద్యార్థుల చదువులకు ఆటంకం కలిగిస్తూ వారికి అసౌకర్యం కలిగించకూడదని సూచించారు. ఏవైనా ఫిర్యాదులు ఉంటే విద్యాశాఖ అధికారులకు లేదా ఉన్నతాధికారులకు మాత్రమే నివేదించాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని విద్యాసంస్థల నిర్వహణకు ఆటంకం కలిగిస్తే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సూర్యాపేట డివిజన్ డీఎస్పీ స్పష్టం చేశారు. కేసులు నమోదు చేయడం, బైండోవర్ చేయడం లాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని హెచ్చరించారు.