ఇసుక లారీలతో తీవ్ర ఇబ్బందులు. పట్టించుకోని అధికారులు

ప్రజల ప్రాణాలు పోయేదాకా అధికారులు రోడ్ల మీద ఉన్న వేయిల ఇసుక లారీలను తొలగించేలా లేరు
న్యూ డెమోక్రసీ నేత ముసలి సతీష్.
చర్ల మండలం నుండి వెంకటాపురం వెళ్లే ప్రధాన రహదారిలో దాదాపు 1000 లారీలకు పైగా రోడ్లమీద ఈరోజు నిలిచిపోయి ఉన్నాయి అధికారులు మాత్రం దున్నపోతుల మీద వర్షం పడినట్టుగా వివరిస్తున్నారని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ముసలి సతీష్ అన్నారు
వేల లారీలు చర్ల నుండి వెంకటాపురం వెళ్లే ప్రధాన రహదారులను ఆక్రమిస్తున్నాయని రోడ్ల మీద నిలిపివేసిన ఇసుక లారీల పైన అధికారులు చర్యలు మాత్రం తీసుకోవడం లేదని ముసలి సతీష్ అన్నారు గత నాలుగు రోజుల క్రితం వెంకటాపురం నుంచి భద్రాచలం కి వెళ్లే అంబులెన్స్ లొ ఒక మహిళ గంటసేపు నొప్పులతో వేల లారీలు రోడ్లమీద నిలిచిపోయి ఉండటం కారణంగా ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయి తీవ్ర అవస్థలకు గురైందని ఇది అధికారులకు తెలిసిందే కానీ ఈరోజు కూడా వేల లారీలు రోడ్లమీద నిలిపివేసి ఉన్నా పట్టించుకునే పరిస్థితి లేదని ప్రజలు, రైతులు, విద్యర్థులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురివుతున్నారని, కనీసం ప్రాణాపాయ స్థితిలో అంబులెన్సులకు కూడా దారిలేని పరిస్థితి ఇక్కడ ఉందని తక్షణమే జిల్లా అధికారులు స్పందించి చర్ల నుండి వెంకటాపురం వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న లారీలన్నీ రోడ్లమీద నుండి తీపియాలని ఈ రోడ్లు రేసింగ్ కాంట్రాక్టర్ల సొంత రోడ్లు కాదని ప్రజలు కట్టే పన్నులతో నిర్మించిన రోడ్లని ముసలి సతీష్ అన్నారు గత రెండు సంవత్సరాలుగా వేల లారీలు రోడ్లమీద తిరగడం కారణంగా తూర్పాక దగ్గర ఉన్న బ్రిడ్జి కుంగిపోయి ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటా ఉన్నారు అట్లాగే చర్ల నుండి వెంకటాపురం వెళ్లే ప్రధాన రహదారిలో ఏకన్న గూడెం లో ఉన్న బ్రిడ్జి మొత్తం కృంగిపోవడం కారణంగా గత మూడు నెలలుగా రాకపోకలు అతరాయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తక్షణమే జిల్లా అధికారులు స్పందించి రోడ్లమీద లారీలు తీయించకపోతే ప్రజలు ఐక్యం చేసుకొని ఉద్యమం తీవ్రతరం చేస్తామని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీగా హెచ్చరిస్తున్నాం