ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసిన తిరుమలగిరి పోలీస్,

Sep 4, 2024 - 22:48
Sep 4, 2024 - 22:49
 0  27
 ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసిన తిరుమలగిరి పోలీస్,
 ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసిన తిరుమలగిరి పోలీస్,
 ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసిన తిరుమలగిరి పోలీస్,

  ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసిన తిరుమలగిరి పోలీస్, మొత్తం Rs.5,44,000/- విలువ సీజ్.
  4 చైన్ స్నాచింగ్ కేసులు, 10 బైక్ దొంగతనం కేసులు ఛేదించిన తిరుమలగిరి పోలీస్, CCS పోలీసులు.
 3.95లక్షల విలువగల 13 బైక్స్,1.49 లక్షల విలువగల 3.7 తులాల భంగారు ఆభరణాలు సీజ్.
    ఇద్దరు నింధితుల రిమాండ్.

….. సన్ ప్రీత్ సింగ్ ఐపి ‌ఎస్, ఎస్పీ సూర్యాపేట. 

నింధితులు :
A1 పోలేపాక రమేశ్ , వయస్సు 38 సం.లు, వృత్తి కూలి, తుంగతుర్తి మండలం గానుగుభండ గ్రామం. 
A2 జీడి జెడ్డి నరేశ్, వయస్సు 35 సం. లు, వృత్తి : పెయింటింగ్ వర్క్, అర్వపల్లి మండలం, తిమ్మాపురం.
    A1 పై 16 కేసులు డిటెక్ట్ చేయడం జరిగినది, ఈ 16 కేసులు కాక ఇతనిపై గతములో మరో 12 కేసులు ఉన్నాయి.

 జిల్లా పోలీసు కార్యలయం నందు నిర్వహించిన మీడియా సమావేశం నందు కేసు వివరాలు వెల్లడించిన ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిం‌ఎస్ గారు వెల్లడించారు. ఎస్పీ గారి వెంట CCS ఇన్స్పెక్టర్ శివ కుమార్, నాగారం CI రఘువీర్ రెడ్డి, CCS SI  శ్రీకాంత్,  తిరుమలగిరి SI సురేష్ ఉన్నారు. కేసులో భాగా పని చేసిన CCS సిబ్బందిని ఎస్పీగారు రివార్డ్స్ తో అభినందించారు.

కేసు వివరాలు:

    ఈరోజుఅనగా 04.09.2024 ఉదయం 6 గంటల సమయంలో తిరుమలగిరి SI తన సిబ్బందితో తిరుమలగిరి x రోడ్ వద్ద వాహనల తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు పల్సర్బైక్ AP-29 BQ-6328 పై అనుమానాస్పదంగా అడ్డగూడూరు వైపు నుండి సూర్యాపేటకు వైపుకు వెళుతూ పోలీసు వారిని గమనించి పారిపోతుండగా తిరుమలగిరి SI తన సిబ్బందితో కలిసి ఇద్దరినీ ఆధుపులోకి తీసుకోవడం జరిగినది. పట్టుబడి చేసిన వారిని విచారించగా 2020 సంవత్సరం ఆగస్ట్ నెలలో తిరుమలగిరి PS పరిధిలో మామిడిపల్లి గ్రామం – హరిచంద్ర తండా మార్గం మద్యలో నడుచుకుంటూ వెలుతున్న మహిలతో మాట కలిపి బెదిరించి ఆమే మెడలో ఉన్న పుస్తేల తాడును చైన్ స్నాచింగ్ దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు. దీనిపై గతంలో అనగా 26.08.2020న బాణోత్  భారతిW/o హరిలాల్, వయస్సు: 50సంవత్సరాలు, Occ: వ్యవసాయంR/o హరిచంద్రH/o మామిడిపల్లి గ్రామం నాగారం మండలం గారి పిర్యాధు మేరకు నేరం సంఖ్య 170/2020, U/S 382 IPC  ప్రకారం తిరుమలగిరి PS నందు కేసు నమోదు చేయడం జరిగినది. ఇద్దరు నింధితులు A1 పోలేపాక రమేశ్ , వయస్సు 38 సం.లు, వృత్తి కూలి, తుంగతుర్తి మండలం గానుగుభండ గ్రామం. A2 జీడి నరేశ్, వయస్సు 35 సం. లు, వృత్తి : పెయింటింగ్ వర్క్, అర్వపల్లి మండలం, తిమ్మాపురం గ్రామం కు చెందిన వారుగా గుర్తించడం జరిగినది, ఈ ఇరువురు నిందితులను 170/2020, U/S 382 IPC స్నాచింగ్ కేసునందు అరెస్ట్ చేసి విచారించడం జరిగినది.

    విచారణలో భాగంగా A1 పోలేపాక రమేశ్ కొడకండ్ల, తుంగతుర్తి, శాలిగౌరారం పోలీస్ స్టేషన్స్ పరిధిలో చైన్ స్నాచింగ్ కు పాల్పడినట్లు, సూర్యపేట పట్టణ, సూర్యపేట రూరల్,నకిరేకల్, జనగాం, తొర్రూర్, ఆత్మకూర్(ఎస్), కేతేపల్లి పోలీసు స్టేషన్స్ పరిధిలో 10 బైక్స్ దొంగతానాలు చేసినట్లు ఒప్పుకున్నారు. A2 జెడ్డి నరేశ్ A1 తో కలిసి తిరుమలగిరి PS పరిధిచైన్ స్నాచింగ్ కేసులో నింధితుడు. గుర్తించిన కేసుల్లో నింధితుల నుండి 1.49 లక్షల విలువగల 3.7 తులాల బంగారం, 3.95 లక్షల విలువగల  13 బైక్స్ (చైన్ స్నాచింగ్ లో ఉపయోగించిన పల్సర్ బైక్)సీజ్ చేసి రిమాండ్ కు పంపడం జరిగినది. A1 పోలేపాక రమేశ్ ఇంటి వద్ద అనగా గానుగుబండ గ్రామంలో 3.7 తులాల బంగారం, 8 బైక్స్ స్వాదినం చేసుకోవడం జరిగినది, కేతేపల్లి మండలం ఇనుపాముల వద్ద రిసీవర్స్ వంగూరు కృష్ణ, జిల్లేపల్లి నరేశ్ ల నుండి 4 బైక్స్ స్వాదినం చేసుకోవడం జరిగినదివిచారణ చేసి కేసులో వీరిని పెడతాం. A1 పై పైన తెలిపిన 16 కేసులు, తోపాటుగా గతములో 2018 సంవత్సరం నుండి సూర్యపేట్ రూరల్, కొడకండ్ల, లింగాల ఘనపూర్, భువనగిరి, నూతనకల్,ఆత్మకూర్(S) దంతాలపల్లి, తుంగతుర్తి, తొర్రూర్, సూర్యపేట్ టౌన్ పోలీస్ స్టేషన్స్ పరిధిలో మరో 12 కేసుల్లో నేరాలకు పాల్పడ్డాడు.

ఈ కేసుల చెదనలో బాగా పని చేసిన CCS CI శివ కుమార్, నాగారం సర్కిల్ ఇన్స్పెక్టర్ రఘువీర్ రెడ్డి,CCS SI శ్రీకాంత్,తిరుమలగిరి SI సురేష్,CCS సిబ్బందిని,  కేసు లీడ్ చేసిన సూర్యాపేట సబ్ డివిజన్ DSP రవి లను ఎస్పీ గారు అభినందించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333