ఇటుక బట్టి యజమాని మైనర్ బాలికపై అత్యాచార యత్నం

తెలంగాణ వార్త ఆత్మకుర్ ఎస్ మైనర్ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డ ఇటుక బట్టీ యజమాని.* సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ మండలం పాతసూర్యాపేట వెంగమాంబ బాలాజీ హాలో బ్రిక్స్ వద్ద ఘటన. బతుకుదెరువు కోసంఒరిస్సా రాష్టం నుండి వచ్చిన మైనర్ బాలికపై మద్యం మత్తులో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డ వైనం... పోలీసుల అదుపులో ఇటుక బట్టి యజమాని వెంకటరమణ. ఫోక్సో, లేబర్ యాక్ట్, జువైనల్ సెక్షన్ ల కింద కేసులు నమోదు.. ఆత్మకూరు ఎస్.. పొట్టకూటి కోసం ఇటికబట్టిలో పనిచేసేందుకు వందల కిలోమీటర్లు దూరం ఒరిస్సా నుండి వచ్చిన మైనర్ బాలికను మద్యం మత్తులో ఇటుక బట్టి యజమాని అత్యాచార యత్నానికి పాల్పడిన సంఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం పాత సూర్యాపేట శివారులో గల వెంగమాంబ బాలాజీ హాలో బ్రిక్స్ వద్ద జరిగిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం బుధవారం సాయంత్రం వెంగమాంబ బాలాజీ ఇటుక బట్టి యజమాని గోగినేని వెంకటరమణ మద్యం మత్తు లో ఉండి తన బట్టిలో పనిచేస్తున్న 15 ఏళ్ల మైనర్ బాలికను నీవు ఉత్సాహంగా పనిచేస్తున్నావు నీకు స్వీట్ ఇస్తానంటూ తన రూమ్ లోకి పిలిపించాడు. బాలిక రూంలోకి వచ్చిన వెంటనే తలువు పెట్టి అత్యాచారానికి యత్నించాడు. భయంతో కేకలు వేస్తూ తలుపులు తీసుకొని బాలిక బయటకు వచ్చిoది. మైనర్ బాలిక తన కుటుంబ సభ్యులకు జరిగిన విషయం చెప్పింది.కుటుంబ సభ్యులు యజమానిపై అగ్రహం వ్యక్తం చేశారు. వారికి ఏదో రకంగా నచ్చ జెప్పేందుకు ఇటుక బట్టి యజమాని ప్రయత్నించాడు. ఒక సందర్భం లో డబ్బులు ఎర చూపి వినక పోవడం తో బెదిరింపుల కు ప్రయత్నించినట్లు తెలిసింది. గురువారం సాయంత్రం బాలిక తల్లిదండ్రులు ఆత్మకూరు ఎస్ పోలీస్ స్టేషన్ లో జరిగిన సంఘటన వెంకట రమణ పై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు తీసుకున్న ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ సంఘటన స్థలానికి చేరుకొని విచారించాడు. ఇటుక బట్టి యజమాని వెంకటరమణ మైనర్ బాలికను అత్యాచారానికి యత్నించిన విషయం స్థానికుల తో మాట్లాడారు. ఒరిస్సా నుండి పనిచేసేందుకు వచ్చిన కూలీలపై ఇలాంటి అత్యాచారం చేయడం బట్టి యజమానిపై చర్యలు తీసుకోవాలని విచారణ లో చెప్పడంతో ఎస్సైవెంటనే ఉన్నతాధికారుల సూచన మేరకు అత్యాచారానికి పాల్పడిన వెంకటరమణ పై పోక్సో, లేబర్ యాక్ట్, జువెయినల్ , తదితర సెక్షన్ ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం బాధితురాలినీ బరోసా సెంటర్ కు తరలించి అత్యాచారం సంఘటనపై వాంగ్మూలం తీసుకొని రికార్డు వాగ్మూలం ను న్యాయ మూర్తి ముందు సమర్పించనున్నట్లు తెలిపారు. నిందితుడు వెంకటరమణను శుక్రవారం అదుపులోకి తీసుకొన్నట్లు తెలిపారు. *నిందితుడు వెంకటరమణ అక్రమ దందాలలో దిట్ట.* గత 14 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు వచ్చిన గోగినేని వెంకటరమణ సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో ఇటువంటి వ్యాపారానికి తెరలేపాడు. పాత సూర్యాపేట శివారులోని సుమారు పది ఎకరాల్లో ఇటుక బట్టీల తండా ప్రారంభించాడు. నిమ్మి కళ్ళు పాత సూర్యాపేట ఎను బాముల గ్రామాలలోని చెరువుల నుండి రాజకీయ నాయకుల అధికారుల కు ముడుపులు ఇచ్చి నల్లబట్టి దందా జోరుగా కొనసాగించేవాడు. భారీ స్థాయిలో ఇటుక బట్టీలు ఏర్పాటు కొనసాగిస్తున్నాడు. ఇటుక బట్టీల నుండి వచ్చే దట్టమైనపొగ, డస్ట్ కారణంగా పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలు పాడైతున్నాయని ఉన్నతాధికారుల క్రితం రైతులు ఫిర్యాదు చేసిన అధికారులను మంచిగా చేసుకొని బట్టి యజమాని వెంకటరమణ 14 ఏళ్లుగా తన చీకటి అక్రమ దందాలు కొనసాగిస్తున్నట్లు స్థానికులు ఆరోపించారు. ఇటీవల దుబ్బ తండాకు చెందిన ఒక వికలాంగుడు బట్టి సమీపంలో మేకలు వేపుతుండగా అమానుషంగా వెంకటరమణ తీవ్రంగా దాడి చేసి గాయపచినట్లు దుబ్బ తండావాసులు ఆరోపించారు. ఇలాంటి సంఘటనలు మరెన్నో వెంకటరమణ చేసినట్లు డబ్బు, పలుకుబడితో అధికారులు మచ్చిక చేసుకుని తను చేసే తప్పుడు పనులను మాఫీ చేసుకునేవాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒరిస్సా బీహార్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల నుండి కూలీలను తీసుకొచ్చి ఇట్టి చాకిరి చేయించుకోవడం పసిపిల్లలతో పనిచేయించుకుంటున్నాడని పరిసర ప్రాంతాలు రైతులు ఆరోపిస్తున్నారు. వెంకటరమణ అండ చూసుకొని ఐలాపురం, కోటి నాయక్ తండ ,నిమ్మికల్, పాత సూర్యాపేట, గ్రామాల పరిధిలో భారీగా ఇటుక బట్టీల దందా అందులో చిన్నపిల్లలతో పని చేయించుకోవడం కొనసాగుతుందని ఉన్నతాధికారులు ఇటుక బట్టీలపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని పంట పొలాలు రక్షించాలని కోరుతున్నారు.