ఇక పై ప్రతి సోమవారం రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం.
డివిజన్ స్థాయి అధికారులు ప్రజావాణి కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలి.
డివిజన్ పరిధిలోని ప్రజలు వారి సమస్యలను ఆర్ డి ఓ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో సమర్పించవచ్చు.
ఇక పై ప్రతి సోమవారం ఆర్ డి ఓ కార్యాలయాలలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఒక ప్రకటనలో తెలిపారు. డివిజన్ స్థాయి ప్రజావానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన ఆర్డిఓ లను ఆదేశించారు. ఇప్పటివరకు జిల్లా కేంద్రంలో మాత్రమే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నదని, అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇక పై ప్రతి సోమవారం ఆర్డిఓ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేశారు. డివిజన్ సాయి ప్రజావాణి కార్యక్రమానికి రెవెన్యూ డివిజనల్ అధికారి వ్యవహరిస్తారనితెలిపారు. డివిజన్ పరిధిలోని డివిజనల్ అధికారులు అందరూ డివిజన్ స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి హాజరు కావాలని ఆదేశించారు.