మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలి

May 10, 2026 - 23:16
 0  3
మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలి

సిపిఐ ఎంఎల్ రెడ్ స్టార్ కేంద్ర కమిటీ సభ్యులు మహమ్మద్ బాషా

సూర్యాపేట: కేంద్రంలో మతోన్మాద విధానాల్ని అవలంబిస్తున్న బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని సిపిఐ (ఎంఎల్) రెడ్ స్టార్ కేంద్ర కమిటీ సభ్యులు మహమ్మద్ బాషా పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో ఆదివారం సిపిఐ (ఎంఎల్) రెడ్ స్టార్ జిల్లా తృతీయ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం తాడిత పీడిత ప్రజల్ని మరింత ఇబ్బందులకు గురి చేస్తూ ఆదానీ అంబానీ వంటి కార్పొరేట్ సంస్థలకు దేశ సంపదను ధారాదత్తం చేస్తుందని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ డైరెక్షన్లో భయానక వాతావరణాన్ని సృష్టిస్తుందని తెలిపారు. గ్యాస్ ఇంధనం ధరలు పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ రెడ్ స్టార్ రాష్ట్ర కార్యదర్శి సైదయ్య, జిల్లా కార్యదర్శి బి, రామచందర్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు నరేందర్, శివ, శ్రీను, నవీన్, కమల్, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333