ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు 20 నుంచి 26 వరకు ప్రారంభించనున్న ఎమ్మెల్యే
అడ్డగూడూరు 7 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలంలో హౌసింగ్ పథకం కింద నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమాలు ఈ నెల 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ పాల్గొని లబ్ధిదారులకు ఇండ్లను ప్రారంభించనున్నారు.
మండల పరిధిలో మొత్తం 25 ఇండ్లు పూర్తి కాగా,దశల వారీగా గృహప్రవేశాలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.అయితే,కొన్ని ఇండ్లు ఫ్లోరింగ్,ప్లంబింగ్,ఎలక్ట్రికల్ పనులు పూర్తికాకపోయినా ఫైనల్ బిల్లులు ఆమోదించబడినట్లు తెలిపారు.ఈ సందర్భంగా హౌసింగ్ ఏఈ గోపీసింగ్ రాథోడ్, రేపాక గ్రామ సర్పంచ్ శ్రీకాంత్ యాదవ్,పంచాయతీ కార్యదర్శి వెంకటేష్ రేపాక గ్రామంలో లబ్ధిదారు మల్కాపురి సరిత ఇంటిని పరిశీలించారు. లబ్ధిదారురాలు మాట్లాడుతూ.. గత పది ఏండ్ల ప్రభుత్వంలో పల్లెల్లో ఒక్క ఇంటిని కూడా నిర్మించలేదని పేద,బీద,మధ్య తరగతి కుటుంబాలకు డబుల్ బెడ్ రూములు అందియలేదని అన్నారు.పేదలకు సొంతింటి ఇంటి చిరుకాల సమస్య ప్రభుత్వం అందించే పేదవాడికి ఎంతో కొంత సహాయంగా ఉంటుందని అన్నారు.