ఆర్ఎంపీల చికిత్సల పరిధి గురించి అవగాహన కార్యక్రమం డీఎంహెచ్వో.
జోగులాంబ గద్వాల 6 ఆగస్టు 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వైద్యాధికారి డాక్టర్ .S.K. సిద్ధప్ప..""జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉన్న ఆర్.ఎం.పి లకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో (IDOC F-30 Block) ఆర్ఎంపీల , చికిత్స ల పరిధి గురించి , ఆర్ఎంపీలకు (ప్రథమ చికిత్స నిర్వహించు వారికి) సమావేశం నిర్వహించారు. ఇటీవల గోన్పాడు గ్రామం, గద్వాల మండలం లో, ఆర్.ఎం.పి నరేందర్ రెడ్డి , తన స్థాయికి మించి రోగులకు చికిత్సలు నిర్వహించడం గురించి, కొంతమంది రోగులకు అస్వస్థత కావడం జరిగిందని దీని విషయం గురించి ఉప్పేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్.D. ఏంజెల్ ద్వారా గోన్పాడు గ్రామంలో, ఆర్ఎంపి నరేందర్ రెడ్డి ,రోగులకు చేసిన చికిత్సల, చేసిన టెస్టుల గురించి, రోగులకు ఇచ్చిన మందుల గురించి , ఎంక్వయిరీ చేసి, రిపోర్ట్ తయారుచేసి, రిపోర్టును జిల్లా కలెక్టర్ కి ఈరోజు అందజేస్తున్నామని తదనంతరం కలెక్టర్ ఆదేశానుసారము చట్ట ప్రకారము చర్యలు తీసుకుంటామని జిల్లాల్లోని ఆర్ఎంపీ లకు ఆదేశించారు..
అదేవిధంగా జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఆర్ఎంపీలు తమ స్థాయికి మించి చికిత్సలు చేసినచో ఇకనుంచి కఠిన చర్యలు తీసుకుంటామని అదే విధంగా ప్రతి ఆర్.ఎం.పి ప్రథమ చికిత్సలు మాత్రమే నిర్వహించాలని ప్రథమ చికిత్స అనే బోర్డు రాసుకోవాలని, ఎటువంటి + (ప్లస్ మార్క్) (రెడ్ లేదా గ్రీన్) మార్కు ప్రథమ చికిత్స బోర్డుపక్కల రాయకూడదని, రోగులకు ఎటువంటి ఐవీ ఫ్లూయిడ్స్ మరియు యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, స్థిరాయిడ్స్, మందులు ఇవ్వకూడదని, ప్రథమ చికిత్స కేంద్రంలో ఎటువంటి మంచాలు, ఐ వి స్టాండ్స్, ఐ వి ఫ్లూయిడ్స్, నెబులైజర్, ఎక్కువ మొత్తంలో మందులు, ఉంచుకోకూడదని మరియు ప్రైవేట్ హాస్పిటల్ కు రెఫర్ చేసే రిఫరల్ స్లిప్పులు మరియు prescription pads ఉండకూడదని మరియు ఎట్టి పరిస్థితుల్లో గర్భిణీ స్త్రీలకు మరియు చిన్నపిల్లలకు అదే విధంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు చికిత్స నిర్వహించకూడదని ఆదేశించారు..
ఇకపై జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఎవరైనా ఆర్ఎంపీలు ప్రథమ చికిత్సలు నిర్వహించకుండా తమ స్థాయికి మించి చికిత్సలు నిర్వహించినచో, తమ స్థాయికి మించిన చికిత్సలు అందించిన ఆర్ఎంపీలపై చట్టప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆదేశించారు....ఈ సమావేశంలో ఉప్పైర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్.D. ఏంజెల్, మరియు కె. మధుసూదన్ రెడ్డి, ఇంచార్జ్ డిప్యూటీ. డెమో.. పాల్గొన్నారు.