ఆరుతడి పంటలు వెయ్యాలి ఏవో నాగేశ్వరరావు
తిరుమలగిరి 05 ఆగస్టు 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- తిరుమలగిరి మండలం తొండ గ్రామములో పెసర పంటను మండల వ్యవసాయ అధికారి సిహెచ్ . నాగేశ్వర రావు పరిశీలించారు ఈ సందర్భంగా రైతులతో వారు మాట్లాడుతూ ఏ ల్ నినో ప్రభావము వల్ల వరి పంటకు బదులు వర్షా ధార పంటలు అయిన జొన్న, పెసర, మినుములు, బొబ్బర్లు ,కంది మరియు కొర్రలు, రాగులు వేసుకోవాలని సూచించడం జరిగినది -వరి మాడులలో ఈ ఆరుతాడి పంటలు వేసుకోవాలని రైతులను కొరటం జరిగినది --గత వానాకాలం సీజన్ కంటే ఈ వానాకాలం లో కంది మరియు పెసర పంటలు అదికముగా వేశారు అని సూచించటం జరిగినది ఆగుస్ట్ 15 వరకు కంది పంట మరియు బొబ్బర్లు ,కొర్రా ,రాగులు, జొన్న వేసుకోవచ్చు కాబట్టి రైతులందరు రైతులందరు కచ్చితం గా ఏదో ఒక పంట వేసుకోవాలని తేలేయజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఈఓ మహిత ,రైతులు తదితరులు పాల్గొన్నారు...