ఆపదలో ఆప్తమిత్రులు

May 2, 2025 - 20:41
 0  14
ఆపదలో ఆప్తమిత్రులు

తెలంగాణ వార్త ఆత్మకుర్ ఎస్  మండల పరిధిలోని కందగట్ల గ్రామ వాస్తవ్యులు ఎల్లబోయిన బుచ్చయ్య- రమాదేవిల కుమారులు హరీష్ (13),సాయిధనుష్(6 ) ఇద్దరికీ వెన్నెముక కండరాల క్షీణత (స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ- SMA) వ్యాధి సోకింది. చిన్నారుల చికిత్సకు కోటి రూపాయలు వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలిసిన కందగట్ల గ్రామానికి చెందిన 2005 SSC బ్యాచ్ విద్యార్థిని,విద్యార్థులు దేశ, విదేశాలలోని మిత్రులు ,తమ మిత్రునికి వచ్చిన కష్టానికి చలించి చేదోడుగా ఉండుటకు ముందుకు వచ్చి వాట్సాప్ గ్రూప్ ద్వారా 56500₹(యాభై ఆరు వేల ఐదు వందల రూపాయలు) సేకరించి ఈరోజు వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నేరెళ్ల దేవరాజు, భోనగిరి వీరయ్య, కొడిదల ఆంజనేయులు, అరూరి యాకస్వామి, గద్దపాటి వీరస్వామి, తండ నాగరాజు తదిరులు పాల్గొన్నారు..