ఆపదలో ఆదుకున్న పవన్ సాయి హాస్పిటల్స్ యజమాన్యం
శాలిగౌరారం 8 ఫిబ్రవరి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండల పరిధిలోని అంబారిపేట గ్రామానికి చెందిన బి.ఆర్.ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు కుమారుడు తోట భానుప్రసాద్ కి గత రెండు నెలల క్రితం ఆక్సిడెంట్ అయి నరాలు దెబ్బతినగా హైదరాబాద్ లో ప్రముఖ కార్పోరేట్ హాస్పిటల్ చికిత్సన్నప్పటికీ అ హాస్పటల్ లో ఇన్సూరెన్స్ అమౌంట్ ఉన్నంత క్లెయిమ్ చేసుకొని చేతులు ఏతేశారు. దాంతో పవన్ సాయి హాస్పిటల్ అధినేత డా"అలేటి శ్రీనివాస్ గౌడ్ ని సంప్రదించగా వెంటనే అక్కడ నుండి పవన్ హాస్పిటల్ కి పెషేంట్ ను తరలించారు.రెండు నెలలు పవన్ సాయి హాస్పటల్ లో ఉచితంగా చికిత్స అందించి ఆనందంగా పెషేంట్ ని ఇంటికి పంపించారు.ఈ సందర్బంగా కుటుంబ సభ్యులు డా"శ్రీనివాస్ గౌడ్ కి హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు