ఆకుతోట రామస్వామి ఈదమ్మతల్లి దేవత ఆలయానికి పూజసామాగ్రి పాత్రలు వితరణ

పూజారులకు పూజ సామాగ్రి అందించిన ఆకుతోట రామస్వామి
కొల్లాపూర్ మండలం:- కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎంతో ప్రసిద్ధిగాంచిన నూతనంగా నిర్మించిన ఈదమ్మ తల్లి దేవత ఆలయానికి కొల్లాపూర్ స్థానిక నివాసి ఆకుతోట రామస్వామి పూజ సామాగ్రిని (పాత్రలు) దేవాలయ పురోహితులకు మరియు ఆలయ కమిటీ సిబ్బందికి అందించడం జరిగింది. ఈనెల 31 వ తారీకు రోజున ఈదమ్మ తల్లి దేవత నూతన విగ్రహాన్ని పూనం ప్రతిష్టించిన సందర్భంగా ఈ కార్యక్రమంలో తమవంతుగా ఆకుతోట రామస్వామి కుటుంబ సభ్యులు సమక్షంలో ఆలయ కమిటీ సభ్యులకు పూజ సామాగ్రి (పాత్రలు) అందించడం జరిగింది. అనంతరం బ్రాహ్మణుల శాస్త్రోక్తంగా ఈదమ్మ తల్లి దేవత దైవ దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమములో ఆకుతోట రామస్వామి మాట్లాడుతూ కొల్లాపూర్ శివారులో ఉన్న ఎంతో ప్రసిద్ధిగాంచిన మహిమలు గల తల్లి ఈదమ్మ తల్లి దేవాలయానికి ప్రతి సంవత్సరము మాకు మా కుటుంబ సభ్యులకు ఉన్న వాటిలోనే కొంత భాగము ఈదమ్మ తల్లి దేవాలయానికి తమ వంతుగా సహాయము అందిస్తున్నాము. ఈ పుణ్య కార్యక్రమంలో మేము పాలుపంచుకోవడం మా కుటుంబ సభ్యులకు మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది అని ఆ తల్లి దీవెనలు మాకు ఎల్లప్పుడూ ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈదమ్మ తల్లి దేవత ఆలయానికి దైవదర్శనం కొరకు చుట్టూ పక్క గ్రామాల నుంచి ప్రజలు, భక్తులు, అభిమానులు తరలిరావడం తో ఆలయ ప్రాంగణం సందడి గా మారింది.