అవ్వ బాగున్నావా అంటూ ఆప్యాయంగా మాట్లాడిన ఎస్సై

Jul 11, 2026 - 12:00
 0  344
అవ్వ బాగున్నావా అంటూ ఆప్యాయంగా మాట్లాడిన ఎస్సై

తిరుమలగిరి 11 జులై 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

అవ్వ ,అయ్యా మీ ప్రాణాలు ఎట్లున్నాయి... 

ఆరోగ్యంగా ఉన్నారా... 

అవ్వ ఈ వయసులో ఏం బాధ వచ్చింది  మికు ...

వృద్ధుల గోడును ఓపికగా విన్న ఎస్ఐ గుత్త వెంకట్ రెడ్డి.. 

 వృద్ధుల కళ్ళల్లో ఆనందం చూసిన ఎస్ఐ... 

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని అవ్వా బాగున్నవా?.. పానమెట్లుంది..? అంటూ తిరుమలగిరి ఎస్సై వెంకటరెడ్డి ఓ వృద్ధ దంపతులను ఆప్యాయంగా పలకరించారు. ఆమె యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మండల పరిధిలోని సిద్ధి సముద్రం తండాకు చెందిన వృద్ధ దంపతులను వారి కొడుకులు పోషించడం లేదంటూ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని వచ్చిన ఆ వృద్ధ దంపతులను ఆప్యాయంగా పలకరించడమే కాకుండా తక్షణమే వారి సమస్యకు పరిష్కారం చూపారు . తనకు ఎంతో ఆప్తుడైన వ్యక్తి వద్ద కష్టం చెప్పుకున్నట్లు ఆమె గోడు వెళ్లబోసుకోగా.. ఎంతో ఓపికగా ఆయన సమస్య గురించి విన్నారు పోలీసులకు, ప్రజలకు మధ్య ఉండే దూరం తగ్గిపోతుంది. బాధ్యతాయుతమైన అధికారి సామాన్య వృద్ధులకు ధైర్యం ఇస్తున్నట్లు తెలుస్తుంది. యువతకు పెద్దల పట్ల ఎలా మర్యాదగా ఉండాలో అర్థం అవుతుంది.... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి