అమరుల ఆశయ సాధన కై ఉద్యమించాలి

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ అమరుల ఆశయ సాధన కై ఉద్యమించాలి. ఆత్మకూరు భూమి, భక్తి విముక్తి కోసం పోరాడి ప్రజల కోసం ప్రాణాలర్పించిన అమరుల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు ఉద్యమించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం మండల పరిధిలోని తుమ్మల పెన్పహాడ్ గ్రామంలో నిర్వహించిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటయోధుడు అలుగుబెల్లి వెంకట నరసయ్య మూడవ సంస్థల సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిజం పాసిడిక పాలన వ్యతిరేకంగా రైతు కూలీలను ఏకం చేసి పోరాడిన గడ్డ ఉమ్మడి నల్లగొండ జిల్లా అని అన్నారు. ఎందరో విప్లవద్యమంలో ప్రజల పక్షాన నిలబడి తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలిపెట్టారని వారి ఆశయ సాధన కోసం అందరం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు కొమ్ముగాస్తు మావోయిస్టుల అణచివేత పేరుతో ఆదివాసీలను అడవి నుండి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కార్మిక కర్షకులకు వసతులు కల్పించలేని ప్రభుత్వాలు ఎమ్మెల్యేలకు ఎంపీలకు వేల వేల జీతాలతో రాష్ట్ర ఖజానాను కొల్లగొడుతున్నాయని అన్నారు. విద్య వైద్యాన్ని అమ్ముతూ ప్రజలకు, ఉద్యోగులకు భద్రత లేకుండా చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా అలుగుబెల్లి వెంకట నరసయ్య స్మారక స్థూపంతో పాటు గ్రామంలో విప్లవోద్యమంలో అమరులైన 85 మంది స్మారకస్తుపాన్ని ఆవిష్కరించారు అంతకుముందు గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి ఎం డేవిడ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఆవుల మధు, వి కోటేశ్వరరావు, అలుగుబెల్లి వాణి వెంకటరెడ్డి, కుంట్ల ధర్మార్జున్, భద్రయ్య, కొప్పుల రంగారెడ్డి, కునుకుంట్ల సైదులు గంట నాగయ్య, బొడ్డు శంకర్ ,కంచరపల్లి సైదులు, పోలేబోయిన కిరణ్, నల్గొండ నాగయ్య ,కంచర్ల నర్సక్క తదితరులు పాల్గొన్నారు.