అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఎస్సై నీలిమ
తిరుమలగిరి 11 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిగి పోలీస్ స్టేషన్ పరిధిలోని అనంతారం ఆదర్శ పాఠశాల & కళాశాల లో గురువారం సూర్యాపేట జిల్లా షీ టీమ్ మరియు భరోసా కేంద్రం బృందం సంయుక్తంగా ‘ పోలీస్ అక్క’ మరియు షీ టీమ్స్ లపై విద్యార్థినులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యాపేట షీ టీమ్ ఎస్ఐ జి. నీలిమ మాట్లాడుతూ బాలికలు మహిళలు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి, చిన్న పిల్లలపై జరిగే లైంగిక, మానసిక వేధింపులను అడ్డుకోవడం, గుడ్ టచ్ - బ్యాడ్ టచ్, మంచి స్పర్శ, చెడు స్పర్శల మధ్య తేడాలను గుర్తించాలి, సామాజిక మాధ్యమాలను ఉపయోగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటి ప్రభావం, సమాజంలో ధైర్యంగా ఎలా ఎదురొదగాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి లేదా వేధింపులు ఎదురైతే వెంటనే 112 సూర్యాపేట షీ టీమ్ వాట్సాప్ నంబర్ 8712686056 షీ టీమ్స్ మరియు పోలీసులను ఎలా ఆశ్రయించాలో విద్యార్థినులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సంజీవ్ కుమార్ పాఠశాల ఉపాధ్యాయ బృందం &షి టీమ్ హెడ్ కానిస్టేబుల్ పి.రాజేందర్ రెడ్డి , హెడ్ కానిస్టేబుల్ డి.యాదగిరి మహిళా హెడ్ కానిస్టేబుల్ కె. కవిత భరోసా సెంటర్ కౌన్సిలర్ పవిత్ర భరోసా సెంటర్ రిసెప్షన్ కిరణ్మయి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.