అక్రమ రవాణాపై నిఘా

May 27, 2026 - 20:49
 0  0
అక్రమ రవాణాపై నిఘా

- పోలీస్ కట్టడి ముట్టడి తనిఖీ.

- పటిష్టంగా వాహనాల తనిఖీలు.

- అక్రమ రవాణా నిరోధం కోసం పోలీసు చర్యలు.

- పోలీస్ అంటే దైర్యం, ప్రజలకు అండగా సేవలు.

తిరుమలగిరి 28 మే 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

ప్రజలకు మెరుగైన సేవలు అందించడం లక్ష్యంగా భద్రత కల్పించడం లక్ష్యంగా, బక్రీద్ పండుగ సందర్బంగా గోవులు, పశువుల అక్రమ రవాణా నిరోధం లో భాగంగా ఎస్పి నరసింహ ఐపిఎస్  ఆదేశాల మేరకు  తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధి ఈదులపర్రే తండా, వెలిశాల చెక్ పోస్ట్ వద్ద పోలీసు కట్టడి ముట్టడి, నాకాబంది కార్యక్రమం నిర్వహించడం జరిగిందని సీఐ నాగేశ్వరరావు మరియు ఎస్ఐ వెంకట్ రెడ్డి తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పోలీసు సేవలు అందిస్తున్నామని తెలిపారు. అక్రమ రవాణా అసాంఘిక కార్యకలాపాలు అనుమానిత వ్యక్తుల కదలికుల నిర్మూలన లక్ష్యంగా కట్టడి ముట్టడి కార్యక్రమం నిర్వహించి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేశామని అన్నారు.ఈ తనిఖీల్లో భాగంగ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశాం, పశువులు, గోవుల అక్రమ రవాణా పై నిఘా ఉంచాం, పేలుడు సామాగ్రి, మారణాయుధాలు తరలింపు ఏమైనా జరుగుతుందా అని పరిశీలించడం జరిగినది. గంజాయి లాంటివి ఏమైనా తరలిస్తున్నారా అనేది పరిశీలిండం జరిగినది. గంజాయి రవాణా చేసిన వ్యక్తులు మళ్లీ సంచరిస్తున్నారా అనేది నిఘా పెట్టాం. గూడ్స్ వాహనాల్లో ప్రయాణికులను ఎక్కించవద్దు అని సుచించాం అన్నారు. నాక బంది లో భాగంగా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి