అడ్డగూడూరు మండల అన్ని గ్రామాలకు ప్రజలకు డీజేకి నో పర్మిషన్
ఎస్సై డి.నాగరాజు

అడ్డగూడూరు 14 సెప్టెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల ప్రజలకు పోలీసు వారి నుంచి ముఖ్య గమనిక,గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహిస్తున్న కమిటీలకు మరియు కమిటీ నిర్వాహకుల సభ్యులకు మండల ప్రజలకు ఏమనగా గణేష్ నిమజ్జనం దృశ్య శోభాయమాన యాత్ర నిర్వహించువారు ఈ క్రింది సూచనలు తప్పనిసరిగా పాటించాలి లేనిచో వారిపై చట్ట ప్రకారం చర్య తీసుకోగలము శోభాయమన యాత్రలో డీజే సౌండ్ బాక్స్ లను ఉపయోగించరాదు. ఇలా ఉపయోగించిన సౌండ్ బాక్స్లను సీజ్ చేయడమే కాకుండా వారిపై చట్ట ప్రకారం చర్య తీసుకుని గల శోభాయమాన యాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కమిటీ వారు మరియు కమిటీ సభ్యులు బాధ్యత వహించవలెను విద్యుత్ తీగలను మరియు వచ్చే పోయే వాహనాలను గమనించుకుంటూ యాత్రను నిర్వహించవలెను శోభాయమన యాత్రలో అశ్లీల నృత్యాలు గానీ మతవిద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలను అట్టి పాటలని ప్రదర్శించరాదు శోభాయ మన యాత్రలో బాణాసంచా కాల్చుట పూర్తిగా నిషేధము, ఇట్టి విషయాన్ని ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాము నిమజ్జనం సమయంలో నీటి వద్ద తగు జాగ్రత్తలు పాటించవలెను మరియు నీటి వద్దకు చిన్న పిల్లలను రానీయకుండా తగు జాగ్రత్తలు పాటిస్తూ నిమజ్జన కార్యక్రమం చేయవలెను ఎస్సై కోరారు.