అడ్డగూడూరులో  రాష్ట్రస్థాయి ద్వితీయ  కబడ్డీ క్రీడోత్సవాలను ప్రారంభించిన ఎంఈఓ సబిత 

Jan 24, 2026 - 19:46
 0  136
అడ్డగూడూరులో  రాష్ట్రస్థాయి ద్వితీయ  కబడ్డీ క్రీడోత్సవాలను ప్రారంభించిన ఎంఈఓ సబిత 

అడ్డగూడూరు 24 జనవరి 2026 తెలంగాణవార్త  రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో క్రీస్తు శేషులు కత్తుల లింగరాజు యాదవ్ జ్ఞాపకార్ధకంగా  తనతో పాటు చదువుకున్న 2016-17  ఎస్ఎస్సి బ్యాచ్  ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ద్వితీయ కబడ్డీ క్రీడోత్సవాలను అడ్డగూడూరు ఎంఈఓ  సబిత శనివారం ప్రారంభించారు.ఈ సందర్భంగా కబడ్డీ నిర్వాహకులు మాట్లాడుతూ..ఈనెల 24 నుండి 26 వరకు కబడ్డీ క్రీడలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో అడ్డగూడూరు సర్పంచ్ వనజ సైదులు,ఎంపీఓ ప్రేమలత,ఉప సర్పంచ్ వరిగడ్డి లోకేష్,వార్డ్ మెంబర్ బైరెడ్డి సందీప్ రెడ్డి,కడారి రమేష్,గజ్జల్లి రవి,షేక్ సమీర్,పయ్యావుల రమేష్,దాసరి బాలరాజ్,గుజ్జ మత్యగిరి, మహేష్,భరత్,కబడ్డీ కమిటీ నిర్వాహకులు  తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333