అడ్డగూడూరులో ఘనంగా మంద క్రిష్ణ మాదిగ జన్మదిన వేడుకలు

Jul 7, 2026 - 19:04
 0  9
అడ్డగూడూరులో ఘనంగా మంద క్రిష్ణ మాదిగ జన్మదిన వేడుకలు

అడ్డగూడూరు 7 జులై 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తావద్ద ఎం.ఆర్.పి.ఎస్ వ్యవస్థాపక అధ్యక్షలు మందకృష్ణ మాదిగ జయంతి,ఎం.ఆర్.పి.ఎస్ ఆవిర్బవా దినోత్సవ వేడుకలను  ఎం.ఆర్.పి.ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు.ఈ సందర్బంగా ఎం.ఆర్.పి.ఎస్ మండల అధ్యక్షులు సూరారం రాజు మాదిగ మోత్కూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాలెంల విద్యాసాగర్ మాట్లాడుతూ.. 32సంవత్సరాల క్రితం ప్రకాశం జిల్లా ఈదుముడిలో పురుడు పోసుకున్న ఎం.ఆర్.పి.ఎస్ నాటి నుండి నేటి వరకు ఎస్సి వర్గీకరణ కొరకే కాకుండా ఎన్నో సామజిక ఉద్యమలకు మద్దతుగా నిలిచింది అని అన్నారు. 32ఏండ్ల వర్గీకరణ కోసం ఎందరో అమరులయ్యారు అని వారి అమరత్వ త్యాగమే వర్గీకరణ అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎం.ఆర్.పి.ఎస్ మండల ప్రధాన కార్యదర్శి బాలెంల నరేష్ మాదిగ అడ్డగూడూరు మండల వార్డు సీనియర్ నాయకులు చుక్క యాదగిరి సభ్యులు బాలెంల సురేష్,గూడెపు పరమేష్, దర్శనాల సతీష్,బాలెంల మహేందర్,నీర్మాల వెంకటేష్, బాలెంల మల్లేష్,బాలెంల బాబు, బాలెంల బాబురావు,గూడెపు నరేష్,ఇటికాల శంకర్, కందుకూరి నరేష్,గూడెపు దామోదర్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333