అడ్డగూడూరులో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

అడ్డగూడూరు05 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు కేంద్రంలో మహనీయుల జయంతోత్సవాలలో భాగంగా భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. పలువురు మాట్లాడుతూ..వారి ఆశయ సాధనలో నేటి యువత మేధావులు కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఏస్ మండల అధ్యక్షులు సూరారం రాజు మాదిగ,అధికార ప్రతినిధి పనుమటి సతీష్ మాదిగ,ప్రధాన కార్యదర్శి బాలేంల నరేష్ మాదిగ,సీనియర్ నాయకులు గజ్జెల్లి రవి మాదిగ, పోలేపాక అబ్బులు మాదిగ బాలెంల అయోధ్య మాదిగ మాజీ ఎంపీటీసీ గూడెపు పాండు బాలెంల మధు,లింగాల శ్యామ్ సుందర్ రెడ్డి, బాలెంల బాబురావు,చేడె మహేందర్,బైరెడ్డి సందీప్ రెడ్డి,బాలెంల అరవింద్,మారిశెట్టి మల్లేష్,గజ్జెల్లి క్రిష్ణ,బాలెంల శంకర్ తదితరులు పాల్గొన్నారు.