అడుగుకో గొయ్యి..

జోగులాంబ గద్వాల 31 ఆగస్టు 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గద్వాల్ జిల్లాలోని రహదారులు మరింత ఛిద్రంగా మారాయి. అడుగుకో గొయ్యి మాదిరిగా.. గుంతల్లో వర్షపు నీరు నిలిచి వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. గద్వాల పట్టణం భీంనగర్ లో యూనియన్ బ్యాంక్ ఎదురుగా ప్రధాన రహదారి పై భారీ గుంత ఏర్పడింది. వర్షాకాలంలో వర్షానికి ఈ గుంత కనపడదు. వాహనదారులు చూసి నడపగలరని కాలనీవాసులు కోరుతున్నారు.