అక్రమ ప్రాజెక్టు లను అడ్డుకోవాలి

Jul 8, 2026 - 16:58
Jul 8, 2026 - 17:01
 0  10
అక్రమ ప్రాజెక్టు లను అడ్డుకోవాలి

అన్ని పార్టీల తో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలి.
 
ఏపీ, కర్ణాటక రాష్ట్రాల నీటి దోపిడీ ని అరికట్టాలి.

సాగు నీటి విషయంలో అన్యాయం జరిగితే పోరు బాట తప్పదు.

సొంత జిల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  వెంటనే స్పందించాలని కోరారు

రాజోలి బండ  ను సందర్శించిన

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి.

జోగులాంబ గద్వాల 8 జూలై 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి :- కర్ణాటక పరిధిలో ఉన్న రాజోలి డైవర్షన్ స్కీమ్ (RDS) ను బుధవారం ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, సారథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా మాజీ ప్రజా ప్రతినిధులతో కలిసి పర్యటించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్ణాటక పరిధిలో అక్రమంగా ప్రాజెక్ట్ లను నిర్మించి, తెలంగాణ కు సాగునీరు అందకుండా అడ్డుకుంటున్నారని అన్నారు.  దీనికి తోడు ఏపీ జలచోర్యం కు పాల్పడుతున్నారని,  దీంతో దిగువన ఉన్న తెలంగాణ లోని ఆర్డీఎస్ ఆయకట్టు రైతులకు అన్యాయం జరుగుతుందని అన్నారు. కనీసం 5 టీఎంసీలు నీరు కూడా అందటం లేదని అన్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కర్ణాటక ప్రభుత్వం తో మాట్లాడటం తో పాటు, అన్ని రాజకీయ పార్టీలతో అఖిల పక్షం సమావేశం ఏర్పాటు చేయాలనీ, కేంద్ర జల సంఘం తో మాట్లాడి నీటి వాటాను సాధించాలన్నారు. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ తరపున పోరుబాట తప్పదని హెచ్చరించారు. జిల్లా రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని వారి తరపున పోరాడి సాగు నీరు అందే వరకు ఉద్యమిస్తూనే ఉంటామని అన్నారు. 

ఈ కార్యక్రమం లో మాజీ మంత్రులు డా. సి. లక్ష్మారెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పట్నం నరేందర్ రెడ్డి,చిట్టెం రామ్మోహన్ రెడ్డి,అంజయ్య యాదవ్, జైపాల్ యాదవ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఆంజనేయులు గౌడ్,మరియు బీఆర్ఎస్ నాయకులు బాస్ హనుమంతు,పరమేశ్వర్ రెడ్డి,నాగేశ్వర్ రెడ్డి,బాలకృష్ణారెడ్డి, సుదర్శన్ రెడ్డి, రఘు రెడ్డి, నాగర్ దొడ్డి వెంకట్ రాములు, కురువపల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State