అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి 

Sep 4, 2024 - 17:06
 0  1
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి 

బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి :చీకటి మహేష్ గౌడ్ 
తెలంగాణ వార్త సెప్టెంబర్ 04 దంతాలపల్లి:- దంతాలపల్లి మండల కేంద్రంలో అకాల వర్షాలతో నష్టపోయిన పంట పొలాలను మరియు వర్షానికి కూలిపోయిన గృహాలను బిజెపి నాయకులు సందర్శించారు ఈ సందర్భంగా బిజెపి మానుకోట జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి మహేష్ గౌడ్ మాట్లాడుతూ గత మూడు రోజులుగా ఎడతెరిపు లేకుండా కురుస్తున్న అకాల వర్షాలతో జిల్లాలో రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. అకాల వర్షంతో పత్తి మరియు వరి, మిర్చి పంటలు పూర్తిగా అకాల వర్షానికి నీట మునిగి ఇసుక మేటలు కట్టడం వలన రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. ఒక్కొక్క ఎకరానికి రైతులకు పంట నష్టపరిహారం పదివేల రూపాయలు చెల్లించాలని ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అన్నారు. నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యేకు నియోజకవర్గం పై పూర్తిస్థాయిలో అవగాహన లేక అధికారులను అప్రమత్తం చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. స్థానిక ఎమ్మెల్యేకు నియోజకవర్గంలో ఎన్ని ఎకరాలలో పంట నష్టం జరిగింది అనే విషయంపై ఇప్పటికి కూడా క్లారిటీ లేదు అని అన్నారు. జిల్లాకు సంబంధించిన ఉన్నత అధికారులు పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించి నష్టపోయిన రైతులను ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. అకాల వర్షానికి గ్రామాలలో ఉన్న పాత ఇల్లు, గుడిసెలు కూలి ప్రజలు నిరాశ్రయులు అయ్యారని వారికి నూతన గృహాలు నిర్మించి ప్రభుత్వం ఆదుకొని వారికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డోర్నకల్ నియోజకవర్గం అసెంబ్లీ కన్వీనర్ తాడ పూర్ణచందర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి దాసరి మురళి, మండల కోశాధికారి చిన్నాల ప్రవీణ్ కుమార్, యు మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు అల్లం సాయికుమార్ , మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు సరి రెడ్డి రాణి రెడ్డి, నాయకులు ఎల్లు దిలీప్ రెడ్డి, ఓర్రే ఉమేష్ యాదవ్, పెందోట బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333