సకాలంలో పనులు చెల్లించండి మున్సిపల్ అభివృద్ధికి తోడ్పడండి

తిరుమలగిరి 04 మార్చి 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మున్సిపాలిటీ గృహా, వ్యాపార, వాణిజ్య సంస్థ ల వారి దగ్గర పనులు వసూలు చేస్తున్న అధికారుల పనితీరును పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ యాదగిరి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తిరుమలగిరి పురపాలక సంఘము నకు చెల్లించవలసిన ఇంటిపన్ను, నల్లా బిల్లు, ట్రేడ్ లైసెన్స్ లు తదితర పన్నులను మీ వద్ద కు వచ్చిన అధికారులకు గానీ లేదా మున్సిపల్ కార్యాలయంలో గానీ మార్చి 31వ తేదీలోపు చెల్లించగలరు. లేనిచో మున్సిపల్ చట్టం 2019 ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో బిల్ కలెక్టర్లు సోమల్లు, పాండు పాల్గొన్నారు.