అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభను జయప్రదం చేయండి DTF

Mar 7, 2025 - 20:38
 0  3

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభను జయప్రదం చేయండి...... DTF 07.03.2025న డెమోట్రిక్ టీచర్స్ ఫెడరేషన్ ఆత్మకూర్( ఎస్ ) మండల శాఖ, మండల కమిటీ సమావేశం ఆత్మకూరు (ఎస్) మండల కేంద్రంలో జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి డిటిఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ కే. యోగానంద చారి మాట్లాడారు. 20 వ శతాబ్ద ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా నూల్లు మిల్లులలో, కర్మగారాలలో పనిచేసే శ్రామిక మహిళలు తమ హక్కుల సాధన కోసం చేసిన త్యాగాలు, పోరాటాలు స్ఫూర్తికి నిదర్శనమే మార్చి 8,అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని అన్నారు. ఈ సందర్భంగా డిటిఎఫ్ సూర్యాపేట జిల్లా కమిటీ తేదీ.08.03.2025 న సూర్యాపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల నంబర్ -2 లో అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం సందర్భంగా సమావేశం ఉదయం 10 గంటలకు నిర్వహిస్తుందని అన్నారు. ఈ సమావేశంలో డిటిఎఫ్ మాసపత్రిక అధ్యాపకజ్వాల సంపాదక వర్గ సభ్యులు" కళావతి "గారు వర్తమాన సమాజంలో మహిళల సమస్యలు - సవాళ్లు అనే అంశంపై ఉపన్యాసం చేస్తారని అన్నారు. ఈ సమావేశానికి మండలంలోని ఉపాధ్యాయులందరూ హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బొల్లెద్దు వెంకన్న, ప్రధాన కార్యదర్శి ఆర్ సుధాకర్ మరియు కవిత గ్రేస్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. . ఇట్లు కే యోగానంద చారి DTF.రాష్ట్ర కౌన్సిలర్