అంతంపల్లిలో బడిబాట

Jun 6, 2024 - 14:53
Jun 6, 2024 - 14:53
 0  2
అంతంపల్లిలో బడిబాట

జోగులాంబ గద్వాల 6 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- గట్టు. మండల పరిధిలోని అంతంపల్లి ప్రాథమిక పాఠశాల లో బడిబాట కార్యక్రమంలో భాగంగా గురువారం మండల విద్యాధికారి నర్సింహులు ఆధ్వర్యంలో.... బడిబాట, ఇంటింటి సర్వే నిర్వహించారు.ఈ సందర్బంగా ఎంఈఓ మాట్లాడుతూ...ప్రభుత్వం విద్యార్థినీ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు రెండు జతల యూనిఫామ్ లు, రుచికరమైన మధ్యాహ్న భోజనం, అర్హులైన వారికి ఉపకార వేతనాలు అందుతాయి అన్నారు.అనంతరం స్కూలు స్థాయి, అమ్మ ఆదర్శ కమిటీలతో సమావేశము నిర్వహించి ప్రతిజ్ఞ చేయించడం జరిగింది, అదేవిధంగా బడిబాట యొక్క ప్రాముఖ్యతను తెలియజేసి గ్రామంలోని బడి ఈడు పిల్లలను  అందర్నీ బడిలో చేర్పించవలసిందిగా కోరడమైనది. ఈ కార్యక్రమంలో చాగదోన పాఠశాల ప్రధానోపాధ్యాయులు అయ్యస్వామి, హెడ్మాస్టర్ రాజు, పాఠశాల ఉపాధ్యాయులు అశోక్, పరుశరాములు, ఎం వి ఎఫ్ వాలంటీర్ దానయ్య, అంగన్వాడీ టీచర్ సరోజ మొదలైన వారు తదితరులు పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State