అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు వేసవి సెలవులు

అంగన్‌వాడీ టీచర్లకు, ఆయాలకు మే నెలంతా వేసవి సెలవులు కమీషనర్ క్రాంతీ వెస్లీ ప్రకటించిందని తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్ & హెల్పర్స్ అసోయేషన్ (ఎఐటియుసి) రాష్ట్ర అధ్యక్షురాలు ఎం.సాయీశ్వరీ తెలిపారు. నేడు (బుధవారం) హైదరాబాద్‌లోని స్త్రీ శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యాలయంలో కమీషనర్ ఎ.క్రాంతి వెస్లీతో తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్ & హెల్పర్స్ అసోయేషన్ (ఎఐటియుసి), ఇతర సంఘాలతో జరిపిన చర్చలలో వేసవి కారణంగా తల్లులకు, పిల్లలకు అంగన్‌వాడీ కేంద్రాలకు రావటానికి కష్టతరంగా ఉందని, లబ్ధిదారులకు టేక్ హోంరేషన్ ఇచ్చి సెలవులు ప్రకటించాలని వినతి మేరకు కమీషనర్ సానుకూలంగా స్పందించి వేసవి సెలవులు మే నెలంతా ప్రకటించినందుకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు సీతక్కకు, కమీషనర్‌కు, అధికారులకు తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్ Ê హెల్పర్స్ అసోసియేన్ (ఎఐటియుసి) తరఫున ధన్యవాదాలు తెలిపారు.
ఎం.సాయీశ్వరీ
రాష్ట్ర అధ్యక్షురాలు