అంగన్వాడి నుంచి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో చేర్పించిన అంగన్వాడి టీచర్

Jun 17, 2026 - 16:14
 0  1
అంగన్వాడి నుంచి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో చేర్పించిన అంగన్వాడి టీచర్

జోగులాంబ గద్వాల 17 జూన్2026 తెలంగాణవార్త ప్రతినిధి:- మండలం పరిధిలోని చాగాపురం గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాల నందు బుధవారము అంగన్వాడి 1 వా  సెంటర్ నుంచి మగ పిల్లల్ని 4 నీ  ఆడపిల్లల్ని 6 మంది విద్యార్థులను ప్రాథమిక ఉన్నత పాఠశాలలో చేర్పించినట్లు హెడ్మాస్టర్ కాంతయ్య వెల్లడించారు. ఈ సందర్భంగా కాంతయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం  ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి విద్యార్థినీలకు ఉచితంగా మెరుగైన విద్యను అందించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వంఉచితంగా పుస్తకాలు మధ్యాహ్న నాణ్యమైన భోజనము స్కూలు యూనిఫామ్ అందజేయడం జరుగుతుంది. గ్రామంలో ప్రతి ఒక్క బిడ్డ ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు. విద్యార్థులతల్లిదండ్రులకు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు క్రమంతప్పకుండా తమ పిల్లల్ని స్కూల్కు ప్రతిరోజు పంపాలని విద్యార్థులు తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు. ఉపాధ్యాయనీలు అంగన్వాడి టీచర్. విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333